పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా

టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా తన సత్తా చాటాడు.

By Medi Samrat  Published on  25 Aug 2023 11:55 AM GMT
పారిస్ ఒలింపిక్స్ కు అర్హత సాధించిన నీరజ్ చోప్రా

టోక్యో ఒలింపిక్స్‌ స్వర్ణ పతక విజేత, భారత జావెలిన్‌ త్రో స్టార్‌ నీరజ్‌ చోప్రా తన సత్తా చాటాడు. 88.77 మీటర్ల త్రోతో ప్రపంచ ఛాంపియన్‌షిప్ ఫైనల్‌లోకి ప్రవేశించడమే కాకుండా పారిస్ ఒలింపిక్స్‌కు అర్హత సాధించాడు. శుక్రవారం జరిగిన క్వాలిఫయర్స్‌ పోటీల్లో మొదటి ప్రయత్నంలోనే 88.77 మీటర్లు విసిరి ఈ సీజన్‌లోనే అత్యుత్తమ ప్రదర్శన చేశాడు.

నీరజ్ చోప్రా గ్రూప్ A క్వాలిఫైయింగ్‌లో అగ్రస్థానంలో నిలిచాడు. 83 మీటర్ల ఆటోమేటిక్ క్వాలిఫైయింగ్ మార్కును దాటిన ఏకైక త్రోయర్ గా నిలిచాడు. నీరజ్ చోప్రా 88.77 మీటర్లు అతని సీజన్ బెస్ట్. 2024 పారిస్ ఒలింపిక్స్ క్వాలిఫైయింగ్ మార్క్ 85.50 మీటర్లు. జూలై 1న క్వాలిఫైయింగ్ విండో ప్రారంభమైంది. టోక్యో ఒలింపిక్స్ ఛాంపియన్ చోప్రా జూన్ 30, 2022న స్టాక్‌హోమ్ డైమండ్ లీగ్‌లో సాధించిన వ్యక్తిగత అత్యుత్తమ 89.94 స్కోరును కలిగి ఉన్నాడు. హంగేరీ వేదికగా జరుగుతున్న ప్రపంచ అథ్లెటిక్స్‌ ఛాంపియన్‌షిప్‌ క్వాలిఫయర్స్‌ తొలి ప్రయత్నంలోనే ఈ సీజన్ అత్యుత్తమ ప్రదర్శనతో నీరజ్ చోప్రా ఫైనల్‌కు దూసుకెళ్లాడు. ఆదివారం ఫైనల్‌ జరగనుంది.

Next Story