రెండో రోజు ముగిసిన ఆట.. చివ‌ర్లో జడేజా, అక్షర్ మెరుపులు

ND post 321/7 lead by 144 runs with Jadeja, Axar unbeaten. నాగపూర్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది.

By Medi Samrat  Published on  10 Feb 2023 1:07 PM GMT
రెండో రోజు ముగిసిన ఆట.. చివ‌ర్లో జడేజా, అక్షర్ మెరుపులు

నాగపూర్ లో టీమిండియా, ఆస్ట్రేలియా జట్ల మధ్య జరుగుతున్న తొలి టెస్టులో రెండో రోజు ఆట ముగిసింది. రెండో రోజు ముగిసే సమయానికి టీమిండియా తొలి ఇన్నింగ్స్ లో 7 వికెట్లకు 321 పరుగులు చేసింది. ప్రస్తుతానికి భారత్ కు 144 పరుగుల కీలక ఆధిక్యం లభించింది. రవీంద్ర జడేజా 66, అక్షర్ పటేల్ 52 పరుగులతో క్రీజులో ఉన్నారు. గాయం నుంచి కోలుకుని దాదాపు 6 నెలల తర్వాత బరిలో దిగిన జడేజా బౌలింగ్ లో 5 వికెట్లు తీయడమే కాదు, బ్యాటింగ్ లోనూ అర్ధసెంచరీతో మెరిశాడు. 240 పరుగులకే 7 వికెట్లు కోల్పోయిన భారత్ ను జడేజా, అక్షర్ పటేల్ జోడీ ఆదుకుంది. ఇద్దరూ అర్ధసెంచరీలతో రాణించి జట్టుకు విలువైన పరుగులు జోడించారు.

ఈ మ్యాచ్ తో అంతర్జాతీయ అరంగేట్రం చేసిన తెలుగు తేజం కేఎస్ భరత్ త‌క్కువ‌ స్కోరుకే అవుటయ్యాడు. కెప్టెన్ రోహిత్ శర్మ 120 పరుగులు చేసి అవుట్ కావడంతో బరిలో దిగిన భరత్ 10 బంతులు ఆడి 8 పరుగులే చేశాడు. ఆస్ట్రేలియా యువ స్పిన్నర్ టాడ్ మర్ఫీ బౌలింగ్ లో భరత్ ఎల్బీడబ్ల్యూ అయ్యాడు. ఈ మ్యాచ్‌ తొలి ఇన్నింగ్స్‌లో కేఎల్‌ రాహుల్‌(20), విరాట్‌ కోహ్లి(12), పుజారా(7), మరో అరంగేట్ర ఆటగాడు సూర్యకుమార్‌ యాదవ్‌(8) తీవ్రంగా నిరాశపరిచారు. ఆస్ట్రేలియా బౌలర్లలో టాడ్ మర్ఫీ 5, కెప్టెన్ పాట్ కమిన్స్ 1, నాథన్ లైయన్ 1 వికెట్ తీశారు. అంతకు ముందు, ఆస్ట్రేలియా తొలి ఇన్నింగ్స్ లో 177 పరుగులకు ఆలౌట్ అయింది.

Next Story