ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌.. జ‌యంత్ యాద‌వ్‌, సైనీల‌కు చోటు

Navdeep Saini and Jayant Yadav Added to India Squad for ODI's.ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డేల్లో త‌ల‌ప‌డే భార‌త జ‌ట్టులో

By తోట‌ వంశీ కుమార్‌  Published on  12 Jan 2022 6:50 PM IST
ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డే సిరీస్‌.. జ‌యంత్ యాద‌వ్‌, సైనీల‌కు చోటు

ద‌క్షిణాఫ్రికాతో వ‌న్డేల్లో త‌ల‌ప‌డే భార‌త జ‌ట్టులో మార్పులు చోటు చేసుకున్నాయి. యువ ఆల్‌రౌండ‌ర్ వాషింగ్ట‌న్ సుంద‌ర్ క‌రోనా బారిన ప‌డ‌డంతో అత‌డి స్థానంలో జ‌యంత్ యాద‌వ్‌ను ఎంపిక చేశారు. ప్ర‌స్తుతం జ‌యంత్ యాద‌వ్ టెస్టు జ‌ట్టుతో పాటే సౌతాఫ్రికాలో ఉన్నాడు. జడేజా స్థానంలో టెస్ట్ ల‌కు ఎంపికైనప్ప‌టికీ అత‌డికి తుది జ‌ట్టులో చోటు ద‌క్క‌లేదు. అలాగే రెండో టెస్ట్‌లో తొడ కండరాల గాయానికి గురైన మహమ్మద్ సిరాజ్‌కు బ్యాకప్‌గా నవ్‌దీప్ సైనీని ఎంపిక చేశారు సెల‌క్ట‌ర్లు. ఈ మేర‌కు బీసీసీఐ(భార‌త క్రికెట్ కంట్రోల్ బోర్డు) సోష‌ల్ మీడియా ద్వారా ఈ విష‌యాన్ని వెల్ల‌డించింది.

ద‌క్షిణాఫ్రికాతో భార‌త జ‌ట్టు మూడు వ‌న్డేల్లో త‌ల‌ప‌డ‌నుంది. 19న తొలి వన్డే, 21న రెండో వన్డే, 23న మూడో వన్డే జరగనున్నాయి. ఇక వ‌న్డేల‌కు సార‌థ్యం వ‌హించాల్సిన హిట్‌మ్యాన్ రోహిత్ శ‌ర్మ గాయం కార‌ణంగా ద‌క్షిణాఫ్రికా ప‌ర్య‌ట‌న‌కు దూరం అయ్యాడు. అత‌డి స్థానంలో కేఎల్ రాహుల్ కెప్టెన్సీ బాధ్య‌త‌లు నిర్వ‌ర్తించ‌నుండ‌గా.. వైస్ కెప్టెన్‌గా బుమ్రా వ్య‌వ‌హ‌రించ‌నున్నాడు.

టీమ్ఇండియా రివైజ్డ్ టీమ్ ఇదే :

కేఎల్ రాహుల్(కెప్టెన్), జస్‌ప్రీత్ బుమ్రా (వైస్ కెప్టెన్), శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, విరాట్ కోహ్లీ, సూర్యకుమార్ యాదవ్, శ్రేయస్ అయ్యర్, వెంకటేశ్ అయ్యర్, రిషభ్ పంత్(కీపర్), ఇషాన్ కిషన్(కీపర్), యుజ్వేంద్ర చాహల్, రవిచంద్రన్ అశ్విన్, భువనేశ్వర్ కుమార్, దీపక్ చాహర్, ప్రసిధ్ కృష్ణ, శార్దూల్ ఠాకూర్, మహమ్మద్ సిరాజ్, జయంత్ యాదవ్, నవ్‌‌దీప్ సైనీ

Next Story