భారత్-పాక్ మ్యాచ్.. స్టేడియంలో సందడి చేసిన నారా లోకేశ్

ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌కు హాజరయ్యారు.

By Medi Samrat  Published on  23 Feb 2025 7:45 PM IST
భారత్-పాక్ మ్యాచ్.. స్టేడియంలో సందడి చేసిన నారా లోకేశ్

ఏపీ మంత్రి, టీడీపీ జాతీయ ప్రధాన కార్యదర్శి నారా లోకేశ్ ఇవాళ భార‌త్‌-పాకిస్తాన్ మ్యాచ్‌కు హాజరయ్యారు. ఛాంపియన్స్ ట్రోఫీలో భాగంగా నేడు చిరకాల ప్రత్యర్థులు భారత్-పాక్ తలపడుతున్నాయి. ఈ మ్యాచ్ కు వేదికైన దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో నారా లోకేశ్ సందడి చేశారు. ఆయన వెంట కుమారుడు నారా దేవాన్ష్ కూడా ఉన్నాడు. వీరిరువురు టీమిండియా జెర్సీలు ధరించి.. త్రివర్ణ పతాకం చేతబూని.. భారత ఆటగాళ్లను ఉత్సాహపరిచారు.

అంత‌కుముందు ఐసీసీ చైర్మన్ జై షాను నారా లోకేశ్ నేడు దుబాయ్‌లో కలిశారు. జై షాను కలవడం సంతోషం కలిగించిందని, ఏపీలో క్రికెట్ మౌలిక సదుపాయాల అభివృద్ధిపై చర్చించామని నారా లోకేశ్ సోషల్ మీడియాలో వెల్లడించారు. ఏపీలో క్రికెట్ అభివృద్ధి పట్ల తనతో పాటు జై షా కూడా ఆసక్తిగా ఉన్నారని వివరించారు.

Next Story