సౌతాఫ్రికాకు ఊహించని షాక్

టీమిండియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో సౌతాఫ్రికాకు ఊహించని షాక్ త‌గిలింది.

By -  Medi Samrat
Published on : 3 Dec 2025 9:20 PM IST

సౌతాఫ్రికాకు ఊహించని షాక్

టీమిండియాతో జ‌రుగుతున్న రెండో వ‌న్డేలో సౌతాఫ్రికాకు ఊహించని షాక్ త‌గిలింది. ఈ మ్యాచ్‌లో ఆ జ‌ట్టు ఫాస్ట్ బౌల‌ర్ నాండ్రే బర్గర్ గాయపడ్డాడు. భారత ఇన్నింగ్స్ 39వ ఓవర్ వేసే క్రమంలో బర్గర్ తొడ కండరాలు పట్టేశాయి. తొలి బంతిని కాస్త ఇబ్బంది పడుతూనే వేసిన బర్గర్‌, రెండో బంతిని మాత్రం బౌల్ చేయలేకపోయాడు. వెంటనే ఫిజియో మైదానంలోకి వచ్చి చికిత్స అందించాడు. అయినప్పటికి అతడు నొప్పి తగ్గలేదు. ఫిజియో సాయంతో మైదానాన్ని వీడాడు. ఇక భారత్ ఇన్నింగ్స్ అయిపోయే వరకూ తిరిగి మైదానంలో రాలేదు. మొత్తం 6.1 ఓవర్లు బౌలింగ్ చేసిన బర్గర్ 43 పరుగులిచ్చి ఓ వికెట్ పడగొట్టాడు. ఇప్పటికే దక్షిణాఫ్రికా స్టార్ పేసర్ కగిసో రబాడ కూడా గాయం కారణంగా సిరీస్ కు దూరమయ్యాడు. ఇప్పుడు బర్గర్ గాయపడడం సఫారీ మేనేజ్మెంట్ ను కలవరపెడుతోంది.

దక్షిణాఫ్రికాతో జరుగుతున్న రెండో వన్డేలో టీమిండియా భారీ స్కోరు సాధించింది. విరాట్ కోహ్లీ (102) 53వ వన్డే సెంచరీ సాధించాడు. ఇక రుతురాజ్ గైక్వాడ్ (105) తన కెరీర్‌లో తొలి వన్డే శతకాన్ని నమోదు చేశాడు. ఆఖర్లో కేఎల్ రాహుల్ మంచి ఇన్నింగ్స్ ఆడడంతో భారత్ నిర్ణీత 50 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 358 పరుగుల భారీ స్కోరు సాధించింది.

Next Story