టీమిండియా మాజీ క్రికెటర్ తండ్రికి 7 ఏళ్ల‌ జైలు శిక్ష.. విషాదంలో కుటుంబం

భారత మాజీ క్రికెటర్ నమన్ ఓజా కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ఓజా తండ్రి వినయ్ కుమార్ ఓజాకు 7 ఏళ్ల జైలు శిక్ష పడింది.

By Medi Samrat  Published on  25 Dec 2024 8:19 AM IST
టీమిండియా మాజీ క్రికెటర్ తండ్రికి 7 ఏళ్ల‌ జైలు శిక్ష.. విషాదంలో కుటుంబం

భారత మాజీ క్రికెటర్ నమన్ ఓజా కుటుంబం తీవ్ర విషాదంలో ఉంది. ఓజా తండ్రి వినయ్ కుమార్ ఓజాకు 7 ఏళ్ల జైలు శిక్ష పడింది. అంతే కాదు వినయ్ కుమార్‌కు రూ.14 లక్షల జరిమానా కూడా విధించారు. మొత్తం వ్యవహారం అక్రమార్జనకు సంబంధించినది.

భారత క్రికెట్ జట్టు మాజీ ఆటగాడు నమన్ ఓజా తండ్రి వినయ్ కుమార్ ఓజాకు బెతుల్ రెండో అదనపు సెషన్స్ న్యాయమూర్తి ఏడేళ్ల జైలుశిక్ష, రూ. 14 లక్షల జరిమానా విధించారు.

2013లో బ్యాంక్ ఆఫ్ మహారాష్ట్ర జౌల్‌ఖేడా బ్రాంచ్‌లో రూ.1.25 కోట్లకు పైగా అపహరణకు సంబంధించిన కేసులో అప్పటి బ్రాంచ్ మేనేజర్ అభిషేక్ రత్నం, అసిస్టెంట్ మేనేజర్ వినయ్ కుమార్ ఓజా, రైతులు ధనరాజ్, లఖన్‌లకు కూడా శిక్ష పడింది.

ముల్తాయ్ రెండో అదనపు సెషన్స్ జడ్జి పంకజ్ చతుర్వేది ఈ దోపిడీకి సూత్రధారి, ముల్తాయ్ బ్రాంచ్ మేనేజర్ అభిషేక్ రత్నంకు 10 సంవత్సరాల జైలు శిక్ష, 80 లక్షల జరిమానా విధించారు. 2013లో అభిషేక్‌ రత్నం జౌల్‌ఖేడ బ్రాంచ్‌కు చెందిన బ్యాంకు అధికారుల పాస్‌వర్డ్‌లను ఉపయోగించి 34 నకిలీ ఖాతాలను తెరిచి, రుణాల అవ‌క‌త‌క‌ల‌కు పాల్ప‌డ్డార‌ని అసిస్టెంట్ పబ్లిక్ ప్రాసిక్యూటర్ రాజేష్ సాబ్లే తెలిపారు.

వినయ్ ఓజా అప్పుడు అసిస్టెంట్ మేనేజర్‌గా ఉన్నారు. జూన్ 19, 2014న బ్యాంక్ బ్రాంచ్ మేనేజర్ రితేష్ చతుర్వేది అవినీతిపై పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేశారు. వినయ్ ఓజాను 2022లో పోలీసులు అరెస్ట్ చేశారు. విచారణ సమయంలో క్యాషియర్ దీనానాథ్ రాథోడ్ మరణించాడు.

నలుగురు నిందితులు కోర్టు నుంచి బెయిల్ పొంది బయటకు వచ్చారు. కోర్టు మంగళవారం శిక్షను ఖరారు చేసింది, అనంతరం పోలీసులు అందరినీ అరెస్టు చేసి ముల్తాయ్ జైలుకు తరలించారు. శిక్ష విన్న తర్వాత క్రికెటర్ తండ్రి వినయ్ కుమార్ ఓజా కన్నీరుమున్నీరయ్యారు. ముఖం దాచుకుని కోర్టు నుంచి బయటకు వెళ్లిపోయాడు.

అంతర్జాతీయ క్రికెట్‌లో నమన్ 1 టెస్ట్, 1 ODI, 2 T20 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. టెస్టుల్లో 2 ఇన్నింగ్స్‌ల్లో 56 పరుగులు చేశాడు. వన్డేల్లో 1 పరుగు, టి 20 ఇంటర్నేషనల్‌లో 12 పరుగులు చేశాడు.

Next Story