Viral Video : ఆరు బంతుల‌ను బాదేశాడు..!

విజయ్ హజారే ట్రోఫీ 2025 రెండవ ప్రీ-క్వార్టర్ ఫైనల్ ఈరోజున జరుగుతుంది. రాజస్థాన్ జట్టు తమిళనాడుతో తలపడుతుంది.

By Medi Samrat  Published on  9 Jan 2025 4:57 PM IST
Viral Video : ఆరు బంతుల‌ను బాదేశాడు..!

విజయ్ హజారే ట్రోఫీ 2025 రెండవ ప్రీ-క్వార్టర్ ఫైనల్ ఈరోజున జరుగుతుంది. రాజస్థాన్ జట్టు తమిళనాడుతో తలపడుతుంది. ఈ మ్యాచ్‌లో తమిళనాడు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ జట్టు 47.3 ఓవర్లలో 267 పరుగులకు ఆలౌటైంది. అభిజీత్ సెంచరీతో చెలరేగి మెరుపులు మెరిపించాడు. దీనికి సమాధానంగా తమిళనాడు జట్టు ఇప్పుడు బ్యాటింగ్ చేస్తోంది.

తుషార్‌, ఎన్‌ జగదీశన్‌ల జోడీ ఓపెనింగ్‌కు రాగా.. తుషార్ 11 పరుగులు చేసి ఔట్ కాగా.. ఎన్ జగదీషన్ క్రీజులో ఉన్నాడు. ఎన్ జగదీషన్ ఇప్పటివరకు యాభై పరుగులు చేశాడు. దూకుడుగా బ్యాటింగ్ చేస్తూ ఒకే ఓవర్లో ఆరు ఫోర్లు బాది అందరి దృష్టిని ఆకర్షించాడు. అమన్ శిఖావత్ వేసిన‌ ఓవర్ తొలి బంతి వైడ్ ఫోర్ కావ‌డంతో ఐదు ప‌రుగులు రాగా.. మిగ‌తా ఆరు బంతుల్లో ఆరు ఫోర్లు బాదాడు. దీంతో మొత్తం 29 పరుగులు వ‌చ్చాయి. BCCI డొమెస్టిక్ తన 'X' ఖాతాలో N జగదీషన్ వీడియోను షేర్ చేసింది. ఈ వీడియో ప్ర‌స్తుతం వైర‌ల్ అవుతుంది.

2020 సంవత్సరంలో ఎన్ జగదీసన్ CSK జ‌ట్టు ద్వారా ఐపీఎల్‌ అరంగేట్రం చేశాడు. CSK తరపున తన మొదటి IPL మ్యాచ్‌లోఆర్సీబీపై జగదీషన్ 33 పరుగులు చేశాడు. అతనిని 2018లో CSK రూ. 20 లక్షలకు కొనుగోలు చేసింది.. కానీ 2022 IPL సీజన్ త‌ర్వాత‌ CSK అతడిని కొనసాగించలేదు. జగదీసన్ IPLలో మొత్తం 13 మ్యాచ్‌లు ఆడి 162 పరుగులు చేశాడు. అతని అత్యధిక స్కోరు 39 పరుగులు. కానీ దేశ‌వాళి క్రికెట్‌లో అత‌డి పేరుపై మంచి ఇన్నింగ్సులు ఉన్నాయి. ఈసారి వేలంలో కూడా అత‌డిని తీసుకోవ‌డానికి ఐపీఎల్ ప్రాంఛైజీలు ఆస‌క్తి చూప‌లేదు.

Next Story