క్రికెటర్లతో కనిపించే ఈ 'మిస్టరీ గర్ల్' ఎవరో తెలుసా..?
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు ముందు ఓ మిస్టరీ గర్ల్ వెలుగులోకి వచ్చింది.
By Medi Samrat Published on 10 Dec 2023 6:15 PM ISTభారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య తొలి టీ20 మ్యాచ్‌కు ముందు ఓ మిస్టరీ గర్ల్ వెలుగులోకి వచ్చింది. టీమిండియా క్రికెటర్ల సెల్ఫీ లో ఈ మిస్టరీ గర్ల్ కనబడింది. ఇప్పుడే కాదు.. ఈ మిస్టరీ గర్ల్ ఇంతకు ముందు కూడా చాలా సార్లు కనిపించింది. కొన్నిసార్లు మహేంద్ర సింగ్ ధోని, కొన్నిసార్లు రోహిత్ శర్మ, బీసీసీఐ కార్యదర్శి జై షాతో కూడా ఆ యువతి కనిపించింది. దీంతో ఈ మిస్టరీ గర్ల్ ఎవరో తెలుసుకోవాలని అభిమానులు ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు.
భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య మ్యాచ్ జరగడానికి ముందే ఈ మిస్టరీ గర్ల్ మరోసారి చర్చనీయాంశమైంది. ఈ మిస్టరీ గాళ్ పేరు రాజల్ అరోరా.. ఆమె టీమ్ ఇండియాతో కలిసి పనిచేస్తుంది. ఆమె పూర్తి పేరు రాజలక్ష్మి అరోరా. ఆమె భారత జట్టులో డిజిటల్ ప్రొడక్షన్‌లో పని చేస్తుంది. అందుకే ఆమె ఎప్పుడూ భారత జట్టుతో ఉంటుంది. భారత జట్టుతోనే కాదు.. ఐపీఎల్ సమయంలోనూ ఆమె కనిపించింది. సోషల్ మీడియాలో ఎలాంటి ఫోటోలు, వీడియోలు పోస్ట్ చేసినా అది రాజల్ అరోరా పర్యవేక్షణలోనే జరుగుతుంది. కేవలం రాజల్ టీమ్ మాత్రమే సోషల్ మీడియాలో ఫోటోలు లేదా వీడియోలను పోస్ట్ చేస్తుంది. ఆటగాళ్ల ఇంటర్వ్యూల నుంచి బీసీసీఐ షేర్ చేసిన అన్ని వీడియోల వెనుక రాజల్ అరోరా ఉన్నారు.
రాజల్ అరోరా కంటెంట్ రైటర్‌గా తన కెరీర్‌ను ప్రారంభించింది. ఆ తర్వాత ఆమె బీసీసీఐతో కలిసి పనిచేయడం ప్రారంభించింది. చాలా కాలంగా ఆమె బీసీసీఐతో కలిసి పని చేస్తోంది. భారత్ వర్సెస్ సౌతాఫ్రికా మధ్య మ్యాచ్‌కు ముందు రాజల్ అరోరా మరోసారి వైరల్‌గా మారింది. క్రికెట్ అభిమానులు ఆమెపై రకరకాల కామెంట్లు చేస్తున్నారు.