డిష్యుం.. డిష్యుం : సహచరుడిని కొట్టబోయిన బంగ్లా క్రికెటర్
Mushfiqur Rahim throws a punch at his teammate as tempers flare in Bangabandhu T20 Cup. క్రికెట్ అంటే జెంటిల్‌మన్ గేమ్
By Medi Samrat Published on 15 Dec 2020 5:33 AM GMTక్రికెట్ అంటే జెంటిల్‌మన్ గేమ్ అని అంటారు. విజయం కోసం ఇరు జట్ల ఆటగాళ్లు చివరికంటా పోరాడుతారు. గెలిచినా.. ఓడినా.. ప్రత్యర్థి ఆటగాళ్లకు తగిన గౌవరం ఇస్తారు కనుకనే దీనిని జెంటిల్‌మన్ గేమ్ అని పిలుస్తారు. అయితే.. ఇటీవల కాలంలో ఈ గేమ్‌లో కొద్ది మంది చేసే చేతలు.. కొంత అపఖ్యాతిని తీసుకువస్తున్నాయి. వీరిలో అందరి కంటే ముందుగా బంగ్లాదేశ్ ఆటగాళ్లు ఉంటారు. వికెట్లు తీసినప్పుడు నాగిని డ్యాన్స్ చేస్తూ ప్రత్యర్థి ఆటగాళ్లని కవ్వించడం.. గెలవక ముందే సంబరాలు చేసుకొని చివరికి నిరాశపడడం వాళ్లకే చెల్లుతుంది.
తాజాగా.. బంగ్లాదేశ్ స్టార్ క్రికెటర్, మాజీ కెప్టెన్ ముష్ఫికర్ రహీమ్ సహనం కోల్పోయాడు. మైదానంలో తన సహచరుడిపైనే చెయ్యెత్తాడు. కుడి చేతితో దాదాపు తన సహచరుడి ముఖం మీద కొట్టినంత పని చేశాడు. జట్టులోని ఆటగాళ్లంతా సముదాయించినా అతనిలో కోపం తగ్గలేదు. బంగాబంధు టీ20 సందర్భంగా డాకా, బరిషల్ మధ్య జరిగిన ఎలిమినేటర్ మ్యాచ్‌లో ఈ ఘటన చోటు చేసుకుంది.
Calm down, Rahim. Literally. What a chotu 🐯🔥
— Nikhil 🏏 (@CricCrazyNIKS) December 14, 2020
(📹 @imrickyb) pic.twitter.com/657O5eHzqn
బరిషల్ విజయానికి 19 బంతుల్లో 45 పరుగులు అవసరం. క్రీజులో కుదురుకున్న హుస్సేన్ బౌన్సర్‌ను ఫైన్‌లెగ్ మీదుగా బౌండరీకి పంపే ప్రయత్నం చేశాడు. అయితే.. బంతి బ్యాట్ ఎడ్జ్ తీసుకుని అక్కడే గాల్లోకి లేచింది. కీపర్ రహీమ్, ఫైన్ లెగ్ ఫీల్డర్ నజుమ్ అహ్మద్ క్యాచ్ అందుకునే క్రమంలో ఢీకొట్టుకోబోయారు. కానీ రహీమ్ తడబడుతూనే క్యాచ్ పట్టేశాడు. క్యాచ్ పట్టిన వెంటనే సహచరుడు నజుమ్‌ను అదే చేత్తో కొట్టబోయాడు. రహీమ్ చర్యకు నజుమ్ ఒక్కసారిగా షాక్ తిన్నాడు. నిజానికి ఈ క్యాచ్‌ను ఫైన్‌లెగ్‌లో ఉన్న నజుమ్ అందుకోవాలి. కానీ రహీమ్ ఎలాంటి సంజ్ఞ ఇవ్వకుండానే పరుగెత్తుకుంటూ వచ్చి క్యాచ్ పట్టడం గమనార్హం. కాగా.. ముప్షికర్ ప్రవర్తనపై విమర్శలు వస్తున్నాయి. జూనియర్ ఆటగాళ్లను ప్రోత్సహించకుండా మైదానంలో ఇలా ఆవేశం పడడం సరికాదని, సీనియర్ క్రికెటర్‌గా బాధ్యతగా ఉండాలని పలువురు మాజీ క్రికెటర్లు కామెంట్లు చేస్తున్నారు.