దినేష్ కార్తీక్ అని అరుస్తున్న అభిమానుల దగ్గరకు కోపంగా వెళ్లిన మురళీ విజయ్

Murali Vijay's classy gesture for fans who teased him with Dinesh Karthik's name. భారత క్రికెటర్లు మురళీ విజయ్, దినేష్ కార్తీక్ ల వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఘటనలు

By Medi Samrat  Published on  30 July 2022 9:30 AM GMT
దినేష్ కార్తీక్ అని అరుస్తున్న అభిమానుల దగ్గరకు కోపంగా వెళ్లిన మురళీ విజయ్

భారత క్రికెటర్లు మురళీ విజయ్, దినేష్ కార్తీక్ ల వ్యక్తిగత జీవితంలో ఎన్నో ఘటనలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే..! దినేశ్ కార్తీక్ మొదటి భార్యను మురళీ విజయ్ పెళ్లి చేసుకున్న సంగతి తెలిసిందే. విజయ్ తో వివాహేతర సంబంధం పెట్టుకోవడంతో కార్తీక్ తన మొదటి భార్య నికితకు విడాకులు ఇచ్చాడని అప్పట్లో కథనాలు కూడా వచ్చాయి. ఈ ఘటన కారణంగా దినేష్ కార్తీక్ బాగా కుంగిపోయాడని చెప్పుకొచ్చారు. ఆ తర్వాత దినేష్ కార్తీక్ దీపిక పల్లికల్ ను పెళ్లి చేసుకున్నాడు. ఇక 37 సంవత్సరాల వయసులో కూడా దినేష్ కార్తీక్ అద్భుతమైన ప్రదర్శన చేస్తూ వస్తున్నాడు. కొత్త దినేష్ కార్తీక్ ను చూస్తూ ఉన్నాం.

అయితే తాజాగా మురళీ విజయ్ ను రెచ్చగొట్టారు అభిమానులు. మురళీ విజయ్ ఫీల్డింగ్ చేస్తూ ఉండగా.. డీకే డీకే అంటూ అరిచారు. తమిళనాడు వేదికగా సాగుతున్న తమిళనాడు ప్రీమియర్ లీగ్ లో రూబీ ట్రిచీ వారియర్స్ తరఫున మురళీ విజయ్ ఆడుతున్నాడు. మధురై పాంథర్స్ తో జరిగిన మ్యాచ్ లో వారియర్స్ టీం 36 పరుగుల తేడాతో ఓడిపోయింది. ఈ మ్యాచ్ లో మురళీ విజయ్ ఫ్యాన్స్ తో గొడవకు దిగాడు. స్టాండ్స్ లోకి దూసుకెళ్లాడు. బౌండరీ లైన్ దగ్గర విజయ్ ఫీల్డింగ్ చేస్తుండగా.. ఫ్యాన్స్ డీకే.. డీకే అంటూ నినాదాలు చేయడంతో కోపానికి గురైన విజయ్.. వారి వద్దకు వెళ్లి గొడవ పడ్డాడు. మ్యాచ్ చూడటానికి వచ్చిన ప్రేక్షకులు సైతం విజయ్ పై ఎదురుతిరిగారు. అక్కడ ఉన్న సెక్యూరిటీ సిబ్బంది వచ్చి విజయ్ ని గ్రౌండ్ లోకి పంపారు. దీనికి సంబంధించిన వీడియోలు ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి.Next Story
Share it