టీమిండియా స్టార్ బ్యాట్స్‌మెన్ మురళీ విజయ్ అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించాడు. సోమవారం ట్విట్టర్ ద్వారా తన నిర్ణయాన్ని ప్రకటించాడు. టీమిండియాకు రెగ్యులర్ టెస్ట్ ఓపెనర్ అయిన విజయ్.. 2018 సీజన్‌లో వరుస పేలవ ప్రదర్శనల దృష్ట్యా జట్టుకు దూరమయ్యాడు. ఈ క్రమంలోనే విజయ్‌ని తొలగించాలని భారత జట్టు మేనేజ్‌మెంట్ నిర్ణయించింది. ఆ తర్వాత విజయ్ జట్టులోకి రాలేదు.
అత్యంత స్టైలిష్ బ్యాట్స్‌మెన్‌లలో ఒకడైన విజయ్.. 61 టెస్టుల్లో 12 టెస్ట్ సెంచరీలు, 15 హాఫ్ సెంచరీలు చేశాడు. విజయ్ 38.28 సగటుతో 3,982 పరుగులు చేశాడు. చెన్నై సూపర్ కింగ్స్ తరఫున ఆడుతూ ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో కూడా తనదైన ముద్ర వేశాడు. విజయ్ ఐపీఎల్‌లో రెండు సెంచరీలు చేశాడు. ఐపీఎల్ కెరీర్‌లో ఓవరాల్‌గా 106 మ్యాచ్‌లలో 121.87 స్ట్రైక్ రేట్‌తో మొత్తం 2619 పరుగులు చేశాడు.