గ్రీన్ సెంచరీ.. సన్‌రైజర్స్‌పై ముంబై ఇండియన్స్ ఘ‌న‌విజ‌యం

Mumbai Indians won by 8 wkts. ఐపీఎల్ 2023 69వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది.

By Medi Samrat  Published on  21 May 2023 7:30 PM IST
గ్రీన్ సెంచరీ.. సన్‌రైజర్స్‌పై ముంబై ఇండియన్స్ ఘ‌న‌విజ‌యం

ఐపీఎల్ 2023 69వ మ్యాచ్‌లో ముంబై ఇండియన్స్ ఎనిమిది వికెట్ల తేడాతో సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను ఓడించింది. ఈ విజయంతో ముంబై జట్టు ప్లేఆఫ్ రేసు ఆశ‌ల‌ను స‌జీవంగా ఉంచుకుంది. అదే సమయంలో ముంబై విజయంతో రాజస్థాన్ జట్టు ప్లేఆఫ్ రేసు నుంచి నిష్క్రమించింది. ఇప్పుడు నాలుగో స్థానం కోసం ముంబై, ఆర్సీబీ మధ్య పోరు సాగ‌నుంది. ఈ మ్యాచ్‌లో ముంబై టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన హైదరాబాద్ 200 పరుగులు చేయగా.. ముంబై రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని సాధించింది.

కెమెరూన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్ అద్భుతమైన భాగస్వామ్యం నెల‌కొల్పారు. ఇద్దరూ వేగంగా పరుగులు చేసి తమ జట్టును విజయానికి చేరువ చేశారు. గ్రీన్ సెంచరీ న‌మోదుచేయ‌గా.. అదే సమయంలో సూర్యకుమార్ 25 ప‌రుగులు చేశారు. రోహిత్ శ‌ర్మ‌(56) అర్ధ సెంచ‌రీ సాధించాడు. అంత‌కుముందు స‌న్‌రైజ‌ర్స్ జ‌ట్టులో మయాంక్ అగ‌ర్వాల్‌(83), వివ్రాంత్ శ‌ర్మ‌(69) ప‌రుగులు చేశారు. ముంబై బౌల‌ర్ల‌లో ఆకాశ్ మ‌ద్వాల్ నాలుగు వికెట్లు ప‌డ‌గొట్టాడు. స‌న్‌రైజ‌ర్స్ బౌల‌ర్ల‌లో భువ‌నేశ్వ‌ర్ కుమార్ ఒక‌టి, మ‌యాంక్ ద‌గ‌ర్ ఒక‌టి చొప్పున వికెట్లు తీశారు.


Next Story