వర్షం వల్ల కాస్త అడ్డంకి.. టాస్ గెలిచిన ముంబై

Mumbai Indians opt to bowl. గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ కాస్త ఆలస్యంగా మొదలైంది.

By Medi Samrat  Published on  26 May 2023 2:33 PM GMT
వర్షం వల్ల కాస్త అడ్డంకి.. టాస్ గెలిచిన ముంబై

గుజరాత్ టైటాన్స్, ముంబయి ఇండియన్స్ జట్ల మధ్య క్వాలిఫయర్-2 మ్యాచ్ కాస్త ఆలస్యంగా మొదలైంది. ఈ మ్యాచ్ జరుగుతున్న అహ్మదాబాద్ లో వర్షం కురుస్తుండడంతో, టాస్ వేయడానికి కాస్త ఆలస్యం అయింది. వర్షం నిలిచిపోవడంతో కవర్లను తొలగించారు. ఆటగాళ్లు ప్రాక్టీసు కోసం మైదానంలో అడుగుపెట్టారు. ఈ మ్యాచ్ లో గెలిచిన జట్టు ఎల్లుండి (మే 28) ఇదే మైదానంలో జరిగే ఫైనల్లో చెన్నై సూపర్ కింగ్స్ ను ఢీకొంటుంది. ఈ మ్యాచ్ లో టాస్ గెలిచిన ముంబై టీమ్ ఫీల్డింగ్ ఎంచుకుంది.

ముంబై ఇండియన్స్ (ప్లేయింగ్ XI): ఇషాన్ కిషన్(w), రోహిత్ శర్మ(c), కామెరాన్ గ్రీన్, సూర్యకుమార్ యాదవ్, తిలక్ వర్మ, టిమ్ డేవిడ్, క్రిస్ జోర్డాన్, పీయూష్ చావ్లా, జాసన్ బెహ్రెండోర్ఫ్, కుమార్ కార్తికేయ, ఆకాష్ మధ్వల్

గుజరాత్ టైటాన్స్ (ప్లేయింగ్ XI): వృద్ధిమాన్ సాహా(w), శుభమాన్ గిల్, సాయి సుదర్శన్, విజయ్ శంకర్, హార్దిక్ పాండ్యా(c), డేవిడ్ మిల్లర్, రాహుల్ తెవాటియా, రషీద్ ఖాన్, మోహిత్ శర్మ, నూర్ అహ్మద్, మహమ్మద్ షమీ


Next Story