ముంబై ఇండియ‌న్స్‌కు కొత్త కోచ్ వ‌చ్చేశాడు

Mumbai Indians appoint Mark Boucher as head coach.ఐపీఎల్‌లో అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్ల‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఒక‌టి.

By తోట‌ వంశీ కుమార్‌  Published on  16 Sept 2022 2:33 PM IST
ముంబై ఇండియ‌న్స్‌కు కొత్త కోచ్ వ‌చ్చేశాడు

ఇండియ‌న్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో అత్యంత విజ‌య‌వంత‌మైన జ‌ట్ల‌లో ముంబై ఇండియ‌న్స్ జ‌ట్టు ఒక‌టి. ఐదు సార్లు విజేత‌గా నిలిచింది. ఈ జ‌ట్టు ప్ర‌ధాన కోచ్‌గా ఉన్న మ‌హేల జ‌య‌వ‌ర్థ‌నేకు పదోన్న‌తి క‌ల్పించి ఫ్రాంచైజీ పెర్ఫార్మెన్స్‌కు గ్లోబ‌ల్ హెడ్‌గా నియ‌మించింది. దీంతో కోచ్ ప‌ద‌వి ఖాళీ అయింది. ఇక ముంబై కోచ్ గా ఎవ‌రు వ‌స్తారా అని అంద‌రూ ఆస‌క్తిగా ఎదురుచూస్తున్నారు. ఈ క్ర‌మంలో త‌మ జ‌ట్టు కోచ్‌గా ద‌క్షిణాఫ్రికా మాజీ వికెట్ కీప‌ర్ మార్క్ బౌచ‌ర్‌ను నియ‌మించిన‌ట్లు ముంబై జ‌ట్టు ఓ ప్ర‌క‌ట‌న‌లో తెలిపింది.

"మా కొత్త హెడ్ కోచ్‌ను ప‌రిచ‌యం చేస్తున్నాం. ప‌ల్ట‌న్స్.. మ‌న వ‌న్ ఫ్యామిలీలోకి లెజెండ్‌ను స్వాగ‌తించండి" అంటూ ముంబై ఇండియ‌న్స్ ట్వీట్ చేసింది.

దీనిపై రిల‌య‌న్స్ జియో ఇన్ఫోకామ్ చైర్మ‌న్ ఆకాశ్ అంబానీ స్పందించారు. ముంబై ఇండియ‌న్స్‌లోకి మార్క్ బౌచ‌ర్‌ను స్వాగ‌తించ‌డానికి సంతోషంగా ఉంద‌న్నాడు. "మైదానం వెలుప‌ల‌.. లోప‌ల బౌచ‌ర్‌కు ఉన్న అనుభ‌వం జ‌ట్టును విజ‌య‌ప‌థంలో న‌డిపిస్తుంది. జట్టుకు ఆయ‌న అద్భుత‌మైన విలువ‌ను జోడిస్తాడ‌ని" ఆకాశ్ ట్వీట్ చేశారు.

మార్క్ బౌచ‌ర్ మాట్లాడుతూ.. ముంబైఇండియన్స్ జ‌ట్టుకు కోచ్‌గా నియ‌మించ‌డాన్ని గౌర‌వంగా బావిస్తున్నాను. ఆ టీమ్ చ‌రిత్ర‌, వాళ్ల ఘ‌న‌త‌లు ప్ర‌పంచంలోని బెస్ట్ స్పోర్టింగ్ ప్రాంఛైజీల్లో ఒక‌దానిగా ముంబై ఇండియ‌న్స్ ను నిల‌బెడతాయి. నేను స‌వాళ్లు. ఫ‌లితాల‌పైనే దృష్టి పెడ‌తాను.ముంబై గొప్ప ఆట‌గాళ్ల‌తో కూడిన బ‌ల‌మైన జ‌ట్టు. దాని విలువ‌ను మరింత పెంచేందుకు కృషి చేస్తాను అని బౌచ‌ర్ చెప్పాడు.

Next Story