గాయం కారణంగా ఐపీఎల్ 2025 నుంచి వైదొలిగిన అల్లా గజన్‌ఫర్ స్థానంలో ఆఫ్ఘనిస్తాన్ ఆఫ్ స్పిన్నర్ 'ముజీబ్ ఉర్ రెహ్మాన్' ను ముంబై ఇండియన్స్ తీసుకుంది. అతడితో సంతకం చేస్తున్నట్లు ఐదుసార్లు ఛాంపియన్ ముంబై ఇండియన్స్ ప్రకటించింది. 18 ఏళ్ల ఆఫ్ఘన్ స్పిన్నర్ L4 వెన్నుపూసలో, ప్రత్యేకంగా ఎడమ పార్స్ ఇంటరార్టిక్యులారిస్‌లో ఫ్రాక్చర్‌తో బాధపడుతున్నాడు. దీంతో అల్లా గజన్‌ఫర్ ఛాంపియన్స్ ట్రోఫీ ఆడడం లేదు. ఐపీఎల్ కు కూడా దూరమయ్యాడు. ఇటీవల ఆఫ్ఘనిస్థాన్ జింబాబ్వే పర్యటనలో ఘజన్‌ఫర్ గాయపడ్డాడు.
ముజీబ్ ఆఫ్ఘనిస్తాన్‌కు ప్రాతినిధ్యం వహించిన అతి పిన్న వయస్కులలో ఒకడు. 17 సంవత్సరాల వయస్సులో IPL అరంగేట్రం చేశాడు. ముజీబ్ 300 కంటే ఎక్కువ T20 (అంతర్జాతీయ, దేశీయ) మ్యాచ్ లు ఆడాడు. 6.5 యావరేజ్ తో 330 వికెట్లు తీసుకున్నాడు. ఐపీఎల్ మెగా వేలంలో ముంబై ఇండియన్స్ 18 ఏళ్ల ఆఫ్ స్పిన్నర్ ఘజన్‌ఫర్‌ను రూ.4.80 కోట్లకు ఒప్పందం చేసుకుంది.