చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడి మహేంద్ర సింగ్ ధోనీ ఐపీఎల్‌కు గుడ్‌బై చెబుతాడంటూ సోషల్ మీడియాలో ప్రచారం జరుగుతోంది. ప్రస్తుతం చెన్నైలోని ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఢిల్లీ క్యాపిటల్స్ (డీసీ)తో జరుగుతున్న మ్యాచ్ తర్వాత ధోని రిటైర్మెంట్‌పై ప్రకటన వచ్చే అవకాశం ఉందని ప్రచారం జరుగుతూ ఉంది. ఎంఏ చిదంబరం స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ను ధోనీ తండ్రి పాన్ సింగ్, తల్లి దేవకి దేవి ప్రత్యక్షంగా వీక్షిస్తుండటం ఈ వార్తలకు బలం చేకూరుస్తోంది. దీంతో అభిమానులతో పాటు క్రికెట్ వర్గాలు కూడా ఈ గేమ్ తర్వాత ధోనీ ఏమైనా ప్రకటన చేస్తాడా అని ఆసక్తిగా ఎదురుచూస్తున్నాయి.