ధోనీ తన పుట్టినరోజును ఎవరితో జరుపుకున్నాడో తెలుసా.?

MS Dhoni's birthday celebrations with 'special friends'. భారత మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ పుట్టిన రోజును ఆయన అభిమానులు దేశ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు.

By Medi Samrat  Published on  8 July 2023 9:15 PM IST
ధోనీ తన పుట్టినరోజును ఎవరితో జరుపుకున్నాడో తెలుసా.?

భారత మాజీ కెప్టెన్ ఎంఎస్‌ ధోనీ పుట్టిన రోజును ఆయన అభిమానులు దేశ వ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా నిర్వహించారు. భారీ కటౌట్లను ఏర్పాటు చేశారు. పలు ప్రాంతాల్లో అన్నదానం, రక్తదానం వంటివి చేసి తమ అభిమానాన్ని చాటుకున్నారు. ధోనీ మాత్రం మరోసారి తన సింప్లిసిటీని చూపించాడు. రాంచీలో ఉన్న ఫామ్‌హౌస్‌లో పెంపుడు కుక్కలతో కలిసి పుట్టినరోజు కేక్ కట్ చేసాడు. దీనికి సంబంధించిన వీడియోను ధోనీ తన సోషల్ మీడియాలో పంచుకున్నారు. మీ అందరి హృదయపూర్వక శుభాకాంక్షలకు కృతజ్ఞతలని తెలిపాడు. ప్రస్తుతం ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతూ ఉంది.


ధోనీ జులై 7న 42వ పుట్టినరోజు జరుపుకున్నాడు. చిన్న కేక్ ను కట్ చేశాడు. పెంపుడు కుక్కలే గెస్టులుగా ఈ బర్త్ డే పార్టీ సాగింది. చిన్న బల్లపై ఉంచిన కేక్ ను కట్ చేసిన ధోనీ చిన్న ముక్కలను తన కుక్కలకు గాల్లోకి విసరగా కుక్కలు ఎగిరి అందుకున్నాయి. ఆపై తాను కూడా ఒకట్రెండు కేక్ ముక్కలు తినేసి బర్త్ డే వేడుకలను ముగించాడు. ధోనీ ఫామ్ హౌస్ లో ఈ వేడుక జరిగింది. ధోనీ సింప్లిసిటీకి, కుక్కల మీద ఉన్న ప్రేమకు అభిమానులు ఫిదా అవుతూ ఉన్నారు.


Next Story