ధోనీ తన చివరి మ్యాచ్‌ని చెన్నైలోనే ఆడుతాడు : సీఎస్‌కే సీఈఓ
చెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కాశీ విశ్వనాథన్ ఫ్రాంచైజీ భవిష్యత్తు గురించి అనేక విషయాలు వెల్లడించారు
By Medi Samrat Published on 11 Nov 2024 8:45 PM ISTచెన్నై సూపర్ కింగ్స్ చీఫ్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ (CEO) కాశీ విశ్వనాథన్ ఫ్రాంచైజీ భవిష్యత్తు గురించి అనేక విషయాలు వెల్లడించారు. ఐపీఎల్-2025లో ధోనీ భాగమవుతాడని విశ్వనాథన్ స్పష్టం చేశారు. ఫ్రాంచైజీ ఈసారి అతడిని అట్టిపెట్టుకుంది. CSKని ఐదుసార్లు టైటిల్‌కి తీసుకెళ్లిన కెప్టెన్ ధోని తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఎక్కడ ఆడతాడో విశ్వనాథన్ స్పష్టం చేశాడు.
ఈసారి చెన్నై అన్‌క్యాప్డ్ ప్లేయర్‌గా ధోనీని జట్టుతో ఉంచుకుంది. అంటే ఈసారి ధోనీకి ఫ్రాంచైజీ కేవలం రూ.4 కోట్లు మాత్రమే ఇవ్వనుంది. గత సీజన్ ధోనీకి చివరి ఐపీఎల్ అని చర్చలు జరగగా.. అయితే ఈ సీజన్‌లో మెగా వేలానికి ముందు ఫ్రాంచైజీ అతనిని కొనసాగించడం ద్వారా ఈ చర్చలకు ముగింపు పలికింది. అయితే ఈ సీజన్ తర్వాత కూడా ధోనీ ఆడతాడా లేదా అన్నది ఇంకా క్లారిటీ లేదు. ధోనీ ఎవరికీ ఏమీ చెప్పడని.. అన్నీ తన మనసులో ఉంచుకుంటాడని విశ్వనాథన్ చెప్పాడు. ధోనీ తన చివరి మ్యాచ్ చెన్నైలోనే ఆడాలని కోరుకుంటున్నట్లు విశ్వనాథన్ తెలిపాడు.
మాజీ ఫ్రాంచైజీ ఆటగాడు అంబటి రాయుడు మాట్లాడుతూ.. “మహీ భాయ్ విషయానికి వస్తే.. అతను ప్రతిదీ తన మనసులో ఉంచుకుంటాడని మీకు తెలుసు.. ఆయన మాటలు చివరి క్షణంలో మాత్రమే వెల్లడవుతాయి. ధోనీ CSK పట్ల ఎంత మక్కువ కలిగి ఉన్నాడో.. అతనికి ఉన్న ఫాలోయింగ్‌ను దృష్టిలో ఉంచుకుని.. తన చివరి మ్యాచ్‌ను చెన్నైలో ఆడాలనుకుంటున్నట్లు స్వయంగా చెప్పాడు. CSK విషయానికి వస్తే.. అతను చాలా కాలం పాటు ఆడాలని మేము కోరుకుంటున్నామని చెబుతుంది. ధోనీ ఆడాలని కోరుకున్నంత కాలం అతడి కోసం తలుపులు తెరిచే ఉంటాయని.. అతని అభిరుచి, అంకితభావాన్ని గుర్తించి సరైన సమయంలో సరైన నిర్ణయం తీసుకుంటాడని చెప్పగలను అని సీఈఓ అన్నారు.
ఐపీఎల్ ప్రారంభం నుంచి అంటే 2008 నుంచి ధోనీ చెన్నైలోనే ఉన్నాడు. అతని కెప్టెన్సీలో చెన్నై ఐదుసార్లు జట్టు టైటిల్‌ను గెలుచుకున్నాడు. గతేడాది కెప్టెన్సీని వదులుకున్న ధోనీ యువ బ్యాట్స్‌మెన్ రితురాజ్ గైక్వాడ్‌కు కెప్టెన్సీని అప్పగించాడు. ఈసారి చెన్నై గైక్వాడ్‌ను రూ.18 కోట్లకు తన వద్దే ఉంచుకుంది. వీరితో పాటు మతిసా పతిరనను రూ.13 కోట్లకు, శివమ్ దూబేను రూ.12 కోట్లకు టీమ్ ఉంచుకుంది. ఐదుగురు ఆటగాళ్లను అట్టిపెట్టుకున్న చెన్నైకి రూ.55 కోట్ల పర్స్ ఉంది.