మరో ఏడాది కూడా ధోనినే కెప్టెన్
MS Dhoni to Lead CSK in IPL 2023, Confirms Team CEO Kasi Viswanathan. మహేంద్ర సింగ్ ధోని అభిమానులకు ఓ శుభవార్త.
By Medi Samrat Published on 4 Sept 2022 3:13 PM ISTమహేంద్ర సింగ్ ధోని అభిమానులకు ఓ శుభవార్త. మరో ఏడాది కూడా చెన్నై సూపర్ కింగ్స్ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించనున్నాడు. ఈ విషయాన్ని చెన్నై సూపర్ కింగ్స్ యాజమాన్యం ధృవీకరించింది. వచ్చే ఏడాది జరిగే ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్)లో చెన్నై సూపర్ కింగ్స్ (సీఎస్‌కే)కి మహేంద్ర సింగ్ ధోనీ నాయకత్వం వహించబోతున్నాడు. 2008 నుంచి 10 సార్లు చెన్నై ఫ్రాంచైజీకి నాయకత్వం వహించిన మాజీ భారత కెప్టెన్ 2023 IPL సీజన్‌లో కెప్టెన్‌గా ఉంటాడని CSK CEO కాశీ విశ్వనాథన్ ధృవీకరించారు.
ఈ సంవత్సరం ప్రారంభంలో IPL 2022 సీజన్‌లో, టోర్నమెంట్ ప్రారంభానికి రెండు రోజుల ముందు రవీంద్ర జడేజాను కెప్టెన్‌గా నియమించడం ద్వారా జట్టు కెప్టెన్సీలో మార్పుతో ప్రయోగాలు చేసింది. అయితే, ఈ ప్రయోగం విఫలమైంది. ఏప్రిల్ 30 న టోర్నమెంట్ మధ్యలో జట్టును నడిపించడానికి MS ధోనిని తిరిగి తీసుకువచ్చారు. క్రికెట్ చరిత్రలో అత్యంత విజయవంతమైన కెప్టెన్లలో మహేంద్ర సింగ్ ధోని ఒకరిగా పరిగణిస్తారు. 41 ఏళ్ల వికెట్ కీపర్ IPL ప్రారంభమైనప్పటి నుండి చెన్నై సూపర్ కింగ్స్‌కు నాయకత్వం వహిస్తున్నాడు. నాలుగుసార్లు టైటిల్ ను అందించాడు. చెన్నై ఫ్రాంచైజీ డిఫెండింగ్ ఛాంపియన్‌గా 15వ ఎడిషన్ లో అడుగుపెట్టింది. రవీంద్ర జడేజా రూపంలో ధోనీ వారసుడిగా భావించారు. అయితే ఆల్ రౌండర్ జడేజా కెప్టెన్సీ నుంచి వైదొలిగి MS ధోనీకి తిరిగి అప్పగించాడు. ఇప్పుడు రవీంద్ర జడేజా కూడా చెన్నై సూపర్ కింగ్స్ ను వీడబోతున్నాడనే ప్రచారం సాగుతోంది.