జడేజా సంచలన నిర్ణయం.. ధోని సారథ్యంలో బరిలోకి దిగనున్న చెన్నై
MS Dhoni To Lead CSK Again As Ravindra Jadeja Quits Captaincy.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2022 సీజన్‌లో చెన్నై
By తోట వంశీ కుమార్ Published on 1 May 2022 12:32 PM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)2022 సీజన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ జట్టు వరుస పరాజయాలతో సతమతమవుతోంది. ఈ మెగా టోర్నీలో నాలుగు సార్లు టైటిల్‌ను అందుకున్న చెన్నై జట్టు ఈ సీజన్‌లో ఇప్పటి వరకు 8 మ్యాచులు ఆడగా.. రెండింటిలో మాత్రమే విజయం సాధించింది. ఈ నేపథ్యంలో ఆ జట్టు కెప్టెన్ రవీంద్ర జడేజా కీలక నిర్ణయం తీసుకున్నాడు. జట్టు కెప్టెన్సీ బాధ్యతల నుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. ఈ మేరకు జట్టు యాజమాన్యానికి తన నిర్ణయాన్ని తెలిపాడు. ఇందుకు యాజమాన్యం కూడా అంగీకరించింది. దీంతో చెన్నై సూపర్ కింగ్స్ జట్టును మరోసారి ధోనినే నడిపించనున్నాడు.
'వ్యక్తిగతంగా తన ఆటపై మరింత ఫోకస్ పెట్టేందుకే జడేజా ఈ నిర్ణయం తీసుకున్నాడు. ఇక కెప్టెన్సీ బాధ్యతలను తీసుకోవాలని ధోనిని కోరగా.. టీమ్ భవిష్యత్తును దృష్టిలో పెట్టుకుని అతడు అంగీకరించాడు' అని చెన్నై సూపర్ కింగ్స్ జట్టు ఓ ప్రకటనలో తెలిపింది.
📢 Official announcement!
— Chennai Super Kings (@ChennaiIPL) April 30, 2022
Read More: 👇#WhistlePodu #Yellove 🦁💛 @msdhoni @imjadeja
ఇక ప్రస్తుత సీజన్‌లో రెండు విజయాలు మాత్రమే సాధించిన చెన్నై జట్టు పాయింట్ల పట్టికలో తొమ్మిదో స్థానంలో ఉంది. ఇంకా ఆరు మ్యాచులు ఆడాల్సి ఉంది. ఈ ఆరు మ్యాచుల్లో విజయం సాధించడంతో పాటు ఇతర జట్ల సమీకరణాలు కూడా కలిసి వస్తే ఈ సీజన్ లో చెన్నైప్లే ఆఫ్స్ కు చేరే అవకాశం ఉంది. ఇక ఈ రోజు సాయంత్రం ధోని సారథ్యంలో చెన్నై జట్టు హైదరాబాద్‌తో తలపడనుంది.
ఇక ధోని తిరిగి చెన్నై జట్టు కెప్టెన్‌గా నిమమితుడు కావడం పట్ల భారత మాజీ ఆటగాడు వీరేంద్ర సెహ్వాగ్ స్పందించాడు. జ'డేజాను కెప్టెన్‌గా నియమించిన నాటి నుంచే నేను ఈ విషయాన్ని చెబుతున్నా. ధోని కెప్టెన్‌గా లేకపోతే చెన్నై జట్టుకు ఏదీ కలిసి రాదు. ఆలస్యమైనా ఇప్పటికీ మించిపోయింది లేదు. వాళ్లకింకా అవకాశం ఉంది. చెన్నై ఫ్లే ఆఫ్స్‌కు వెళ్లడానికి కావాల్సినన్ని మ్యాచ్‌లు మిగిలి ఉన్నాయి. ఇప్పుడు ధోని పగ్గాలు అందుకున్నాక పరిస్థితి మారుతుంది' అని సెహ్వాగ్ చెప్పుకొచ్చాడు.