తనకు కోపం ఎందుకు తక్కువగా వస్తుందో చెప్పిన కెప్టెన్ కూల్..!
MS Dhoni reveals why he never gets angry on the field. ఓ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించడమంటే ఎన్నో సందర్భాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది.
By Medi Samrat
ఓ జట్టుకు కెప్టెన్ గా వ్యవహరించడమంటే ఎన్నో సందర్భాలను ఫేస్ చేయాల్సి ఉంటుంది. పరిస్థితులకు తగ్గట్టు ప్రణాళికలు రచించడం.. ఎమోషన్స్ క్యారీ చేయడం వంటివి చాలానే ఉంటాయి. అయితే భారత జట్టు మాజీ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని మాత్రం అందుకు పూర్తిగా విరుద్ధం. కెప్టెన్ కూల్ అని ధోనికి పేరు వచ్చింది అందుకే..!
ధోని తనకు కోపం ఎందుకు తక్కువగా కోపం వస్తుందో చెప్పుకొచ్చాడు. తన భావోద్వేగాలను నియంత్రించుకోవడానికి తీవ్రంగా ప్రయత్నిస్తానని చెప్పాడు. "నిజాయితీగా చెప్పాలంటే, మేము మైదానంలో ఉన్నప్పుడు, మిస్ ఫీల్డింగ్, క్యాచ్‌లు వదిలివేయడం లేదా మరేదైనా తప్పులు చేయకూడదనుకుంటాం. ఒక ఆటగాడు ఎందుకు క్యాచ్‌ని ఎందుకు వదిలేశాడో.. ఎందుకు తప్పుగా ఫీల్డింగ్ చేశాడో తెలుసుకోడానికి ఎల్లప్పుడూ ప్రయత్నిస్తాను. ఆ సమయంలో కోపం తెచ్చుకోవడం పెద్దగా ఉపయోగపడదు. అప్పటికే మ్యాచ్ ను 40,000 మంది స్టేడియంలో నుండి చూస్తూ ఉంటారు. కోట్లాది మంది ప్రజలు మ్యాచ్‌ను చూస్తూ ఉంటారు (టీవీలో, స్ట్రీమింగ్ ప్లాట్‌ఫారమ్‌లు). అలాంటి సందర్భాల్లో కోపం తెచ్చుకోవడం అనవసరం" అని ధోని తాజాగా తెలిపాడు.
"ఒక ఆటగాడు గ్రౌండ్‌లో 100 శాతం శ్రద్ధగా ఉండి, అతను క్యాచ్‌ను మిస్ చేస్తే, నాకు ఇబ్బంది లేదు, అంతకు ముందు అతను ప్రాక్టీస్‌లో ఎన్ని క్యాచ్‌లు తీసుకున్నాడో కూడా తెలుసుకుంటాను. ఎక్కడో ఒక సమస్య ఉండి ఉంటుంది. బహుశా దాని వల్ల మనం ఒక గేమ్‌లో ఓడిపోయి ఉండవచ్చు, కానీ వారి ప్రయత్నాన్ని మెచ్చుకోవాల్సి ఉంటుంది. నేను కూడా మనిషినే. మీరందరూ ఎలా భావిస్తారో నాకు కూడా లోపల అలాగే అనిపిస్తుంది. కానీ మేము ఎల్లప్పుడూ భావోద్వేగాలను నియంత్రించడానికి ప్రయత్నిస్తూ ఉంటాం." అని తెలిపాడు మహేంద్ర సింగ్ ధోని.