ధోనీ ఐపీఎల్ నుండి రిటైర్మెంట్‌.. ఫ్యాన్స్ కు ఇంతకన్నా గుడ్ న్యూస్ కావాలా..?

MS Dhoni IPL Retirement News Update. భారత క్రికెట్ లెజెండ్.. సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ కెరీర్ నుండి

By Medi Samrat  Published on  8 July 2021 1:03 PM GMT
ధోనీ ఐపీఎల్ నుండి రిటైర్మెంట్‌.. ఫ్యాన్స్ కు ఇంతకన్నా గుడ్ న్యూస్ కావాలా..?

భారత క్రికెట్ లెజెండ్.. సక్సెస్ ఫుల్ కెప్టెన్ మహేంద్ర సింగ్ ధోని అంతర్జాతీయ కెరీర్ నుండి ఎటువంటి సెండాఫ్ లేకుండా రిటైర్ అయ్యాడు. ఇక ధోనిని ఐపీఎల్ లో మాత్రమే చూసుకుంటూ ఉంటారు అభిమానులు. ధోని ఐపీఎల్ నుండి వచ్చే ఏడాది రిటైర్ అవుతాడనే ప్రచారం సాగుతూ ఉంది. నిన్న మహీ పుట్టినరోజు సందర్భంగా పలువురు ప్రముఖులు పుట్టినరోజు శుభాకాంక్షలు చెప్పగా.. సీఎస్కే ఛీప్ ఎగ్జిక్యూటివ్ ఆఫీసర్ కాశీ విశ్వనాథన్ మాత్రం అదిరిపోయే న్యూస్ చెప్పుకొచ్చారు.

కాశీ విశ్వనాథన్ మాట్లాడుతూ.. మహేంద్రసింగ్ ధోనీ మరో ఏడాది లేదా రెండేళ్లపాటు చెన్నై సూపర్ కింగ్స్ టీమ్‌కి ఆడతాడని అన్నారు. అతను ఫిట్‌గా ఉన్నాడు ఇప్పటికీ నెట్స్‌లో మెరుగ్గా ప్రాక్టీస్ చేస్తున్నాడు. మరి ఎందుకు అతను ఐపీఎల్‌కి రిటైర్మెంట్ ప్రకటిస్తాడు..? ధోనీ మా టీమ్‌లో ఉండటం చాలా సంతోషంగా ఉంది. ఒక కెప్టెన్‌గానే కాకుండా.. లీడర్‌గా, అనుభవం ఉన్న ఆటగాడిగా టీమ్‌లో ఉన్నాడు. ఇప్పటికీ ధోనీ బెస్ట్ ఫినిషర్ టీమ్‌కి బలం కూడా అని తన మద్దతు తెలిపాడు. దీంతో ధోని ఇంకొన్నేళ్లు ఐపీఎల్ లో సందడి చేస్తాడనే క్లారిటీ మాత్రం వచ్చేసింది.


Next Story
Share it