5 లీటర్ల పాలు తాగుతాడట.. ఎట్టకేలకు రూమర్ పై స్పందించిన ధోని

మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ లో అడుగులు వేస్తున్నప్పుడు అతడి చుట్టూ ఎన్నో రూమర్లు తిరుగుతూ ఉండేవి.

By Medi Samrat
Published on : 22 April 2025 9:09 PM IST

5 లీటర్ల పాలు తాగుతాడట.. ఎట్టకేలకు రూమర్ పై స్పందించిన ధోని

మహేంద్ర సింగ్ ధోని క్రికెట్ లో అడుగులు వేస్తున్నప్పుడు అతడి చుట్టూ ఎన్నో రూమర్లు తిరుగుతూ ఉండేవి. ఓ సూపర్ స్టార్ గా ధోని ఎదుగుతున్న సమయంలో ఎన్నో వదంతులు ధోని వెంట ఉండేవి. ఇలాంటి ఓ రూమర్ ఏమిటంటే ధోని రోజుకు 5 లీటర్ల పాలు తాగుతాడని. చాలా మంది ధోనిలా ఎదగడానికి అప్పట్లో ఇలా తాగడం కూడా చేశారు. ఎట్టకేలకు ఈ రూమర్ గురించి మహీ స్పందించాడు.

ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ ఎడిషన్‌లో చెన్నై సూపర్ కింగ్స్ విజయాలు అందక ఇబ్బంది పడుతోంది. ఐదుసార్లు ఛాంపియన్లుగా నిలిచిన ఈ జట్టు, ఎనిమిది మ్యాచ్‌ల్లో రెండు మాత్రమే విజయాలు సాధించి అట్టడుగు స్థాయికి చేరుకుంది. జట్టు దారుణమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ, ఎంఎస్ ధోని మరోసారి సీఎస్‌కేను నడిపించడాన్ని చూసి అభిమానులు సంతోషంగా ఉన్నారు. చెన్నై రెగ్యులర్ కెప్టెన్ రుతురాజ్ గైక్వాడ్ మోచేయి గాయం కారణంగా జట్టుకు దూరమైన తర్వాత, ధోని మళ్ళీ కెప్టెన్ గా విధులను స్వీకరించి తన అభిమానులకు అనేక చిరస్మరణీయ క్షణాలను అందించాడు.

ఇటీవల ధోని ఒక ప్రమోషనల్ కార్యక్రమానికి హాజరై తన గురించి ఒక హాస్యాస్పదమైన విషయాన్ని వెల్లడించాడు. ఆ కార్యక్రమంలో, యాంకర్ ధోనిని మీ గురించి మీరు విన్న అత్యంత హాస్యాస్పదమైన పుకారు గురించి చెప్పాలని అడిగారు. ధోని "నేను రోజుకు ఐదు లీటర్ల పాలు తాగుతాను" అని చెప్పే వారని బదులిచ్చారు. "నేను రోజంతా ఒక లీటరు పాలు తాగేవాడిని, బహుశా అన్ని లీటర్లు తాగడం ఎవరికైనా కొంచెం ఎక్కువ" అని ధోని అన్నాడు. భారత మాజీ కెప్టెన్ వాషింగ్ మెషీన్‌లో లస్సీ తయారు చేసేవాడనే పుకారు గురించి యాంకర్ అడిగారు. తాను లస్సీ అస్సలు తాగనని చెప్పడం ద్వారా ధోని ఆ రూమర్ ను కూడా ఖండించాడు.

Next Story