సస్పెన్స్ కు ఎండ్ కార్డు వేసిన ధోని.. చెప్పిందేమిటంటే..

MS Dhoni ends suspense, features in new advertisement for biscuit brand. మహేంద్ర సింగ్ ధోని ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా

By Medi Samrat  Published on  25 Sep 2022 9:49 AM GMT
సస్పెన్స్ కు ఎండ్ కార్డు వేసిన ధోని.. చెప్పిందేమిటంటే..

మహేంద్ర సింగ్ ధోని ఆదివారం మ‌ధ్యాహ్నం 2 గంట‌ల‌కు సోష‌ల్ మీడియా వేదిక‌గా ఓ ఆస‌క్తిక‌ర వార్త‌తో మీ ముందుకు వ‌స్తాన‌ని చెప్పిన సంగతి తెలిసిందే. ధోని ఎలాంటి న్యూస్ చెబుతాడోన‌ని అభిమానులంతా ఆస‌క్తిగా ఎదురుచూశారు. ఇప్ప‌టికే అంత‌ర్జాతీయ క్రికెట్‌కు రిటైర్‌మెంట్ ప్ర‌క‌టించిన ధోని ఇండియన్ ప్రీమియ‌ర్ లీగ్‌(ఐపీఎల్‌)లో మాత్ర‌మే ఆడుతున్నాడు. దీంతో ఐపీఎల్‌కు కూడా గుడ్ బై చెప్ప‌నున్నాడా అని ప‌లువురు అభిమానులు ఆందోళ‌న చెందారు. అలాంటిదేమీ లేదని ఇది కేవలం కమర్షియల్ కోసం ధోని తీసుకుని వచ్చిన హైప్ అని తేలిపోయింది.

ధోని బిస్కెట్ బ్రాండ్ కోసం కొత్త ప్రకటనలో కనిపించబోతున్నాడు. అలా సస్పెన్స్‌కు ముగింపు పలికాడు. ఒక బిస్కెట్ కంపెనీని ప్రమోట్ చేశాడు ధోని. ఈ కార్యక్రమంలో, ధోనీ ఒక విలేఖరిని వేదికపైకి ఆహ్వానించి.. 2011లో బిస్కెట్ బ్రాండ్‌ను ప్రారంభించినప్పుడు భారతదేశం కూడా ప్రపంచ కప్‌ను గెలుచుకున్నట్లు చెప్పాడు. ఈ సంవత్సరం మనకు మరో ప్రపంచ కప్ ఉంది.. ఆ బిస్కెట్ బ్రాండ్ మళ్లీ ప్రారంభించగలిగితే భారతదేశం మళ్లీ కప్ గెలవగలదని ధోని చెప్పుకొచ్చాడు. 2011లో జరిగినదాన్ని పునరావృతం చేస్తున్నాను.. చరిత్ర సృష్టించడానికి, మనం చరిత్రను పునఃసృష్టించాలని చెప్పాడు.

ప్రపంచంలోని అత్యుత్తమ వికెట్ కీపర్‌లలో ధోని ఒకరిగా గుర్తింపు పొందాడు. భారతదేశానికి మూడు ICC ట్రోఫీలను అందించాడు - 2007 T20 ప్రపంచ కప్, 2011 ODI ప్రపంచ కప్, 2013 ఛాంపియన్స్ ట్రోఫీ ధోని కెప్టెన్సీలో భారత్ కు దక్కాయి. 2004లో భారత జట్టులో చేరిన ధోని.. 350 ODIలు, 98 T20Iలు, 90 టెస్టుల్లో దేశానికి ప్రాతినిధ్యం వహించాడు.Next Story
Share it