Video : ఆ హీరోతో కలిసి భారత్-పాక్ మ్యాచ్ వీక్షిస్తున్న ధోనీ
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత క్రికెట్ జట్టు, పాకిస్థాన్ క్రికెట్ జట్టు మధ్య 5వ మ్యాచ్ జరుగుతోంది
By Medi Samrat Published on 23 Feb 2025 5:30 PM IST
ఛాంపియన్స్ ట్రోఫీ 2025లో భాగంగా దుబాయ్ వేదికగా భారత క్రికెట్ జట్టు, పాకిస్థాన్ క్రికెట్ జట్టు మధ్య 5వ మ్యాచ్ జరుగుతోంది. దుబాయ్ ఇంటర్నేషనల్ క్రికెట్ స్టేడియంలో జరుగుతున్న ఈ మ్యాచ్‌ను ప్రపంచవ్యాప్తంగా భారీగా అభిమానులు వీక్షిస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ, నటుడు సన్నీ డియోల్ కలిసి భారత్-పాకిస్థాన్ మధ్య మ్యాచ్ చూస్తున్నారు. ఇద్దరు స్టార్స్ మ్యాచ్‌ను వీక్షిస్తున్న ఫోటోలు, వీడియోలు సోషల్ మీడియాలో బాగా వైరల్ అవుతున్నాయి.
MS Dhoni & Sunny Deol discussing the Progress of India vs Pakistan match. ⭐ pic.twitter.com/YdGlhbiRrf
— Johns. (@CricCrazyJohns) February 23, 2025
ఏదో ఈవెంట్‌లో ఇద్దరూ కలిసి కూర్చుని ఇండియా-పాకిస్థాన్ మ్యాచ్‌ని ఎంజాయ్ చేస్తున్నారు. మహేంద్ర సింగ్ ధోనీ సారథ్యంలో భారత జట్టు ఛాంపియన్స్ ట్రోఫీ 2013 టైటిల్‌ను గెలుచుకుంది. 12 ఏళ్ల తర్వాత మరోసారి ఛాంపియన్స్ ట్రోఫీని గెలవాలని భారత జట్టు భావిస్తోంది.
ఈ మ్యాచ్‌లో పాక్ కెప్టెన్ మహ్మద్ రిజ్వాన్ టాస్ గెలిచి ముందుగా బ్యాటింగ్ ఎంచుకున్నాడు. పాకిస్థాన్‌కు స్థిరమైన ఆరంభం లభించింది. ఆ జట్టు ఓపెనింగ్ జోడీ తొలి వికెట్‌కు 41 పరుగులు జోడించింది. ఈ భాగస్వామ్యాన్ని 9వ ఓవర్లో హార్దిక్ పాండ్యా బ్రేక్ చేశాడు. కేఎల్ రాహుల్ చేతికి చిక్కి బాబర్ ఆజం క్యాచ్ అవుట్ అయ్యాడు. బాబర్ 26 బంతుల్లో 23 పరుగులు చేశాడు. పాకిస్థాన్ రెండో ఓపెనింగ్ బ్యాట్స్‌మెన్ ఇమామ్ ఉల్ హక్ తప్పిదం కారణంగా రనౌట్ అయ్యాడు. అక్షర్ పటేల్ అద్భుతమైన త్రో అతడిని పెవిలియన్‌కు పంపింది. ఇమామ్ 26 బంతులు ఎదుర్కొని 10 పరుగులు మాత్రమే చేశాడు.