డ్యాన్స్ తో దుమ్ము రేపిన ధోని అండ్ కో..
MS Dhoni and Dwayne Bravo show off dancing skills. MS ధోని, డ్వేన్ బ్రేవో, రుతురాజ్ గైక్వాడ్ సహా పలువురు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్లు
By Medi Samrat Published on 24 April 2022 9:32 AM GMT
MS ధోని, డ్వేన్ బ్రేవో, రుతురాజ్ గైక్వాడ్ సహా పలువురు చెన్నై సూపర్ కింగ్స్ స్టార్లు 'డెవాన్ కాన్వే' వివాహ వేడుకలో డ్యాన్స్ చేశారు. చెన్నై సూపర్ కింగ్స్ ఆటగాడు కాన్వే వివాహానికి MS ధోని, శివమ్ దూబే.. ఇతర CSK ఆటగాళ్లు హాజరయ్యారు. సంప్రదాయ దుస్తులను ధరించి డ్యాన్స్ చేశారు. డిఫెండింగ్ ఛాంపియన్‌గా ఉన్న CSK కు ఈ సంవత్సరం పెద్ద కలిసి రాలేదు, ఇప్పటికి కేవలం రెండు మ్యాచ్‌లను మాత్రమే గెలిచారు. ఐదుసార్లు ఛాంపియన్‌గా నిలిచిన ముంబై ఇండియన్స్‌పై గురువారం రెండో విజయం సాధించింది. IPL 2021 తర్వాత, CSK శార్దూల్ ఠాకూర్, ఫాఫ్ డు ప్లెసిస్, దీపక్ చాహర్‌లతో సహా పలువురు స్టార్‌లను విడుదల చేసింది.
ఫాఫ్ డు ప్లెసిస్‌ను ప్లేయర్ వేలంలో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు ఎంపిక చేసి, ఆపై కెప్టెన్‌గా నియమించగా, శార్దూల్ ఠాకూర్ ఢిల్లీ క్యాపిటల్స్‌కు వెళ్లాడు. చెన్నై సూపర్ కింగ్స్ దీపక్ చాహర్‌ను తిరిగి కొనుగోలు చేసింది, కానీ చివరికి అతను గాయంతో IPL 2022 నుండి తప్పుకున్నాడు. ముంబై ఇండియన్స్‌తో జరిగిన మ్యాచ్‌కు ముందు డెవాన్ కాన్వే వివాహం జరిగింది. ఆటగాళ్లు సంతోషంగా, ఉత్సాహంగా కనిపించారు. డెవాన్ కాన్వే ప్రస్తుతం అతని పెళ్లి తర్వాత అందుబాటులో లేడు. కాన్వే పెళ్లి వేడుకలో MS ధోని, డ్వేన్ బ్రావో, రుతురాజ్ గైక్వాడ్ బాగా డ్యాన్స్ చేశారు. అందుకు సంబంధించిన వీడియో వైరల్ అవుతూ ఉంది. ఇక MS ధోని IPL 2022 ప్రారంభానికి రెండు రోజుల ముందు సూపర్ కింగ్స్ కెప్టెన్సీని వదులుకున్నాడు, రవీంద్ర జడేజాకు కెప్టెన్సీ ఇచ్చాడు.