ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ బౌల‌ర్ కూడా బ్రేక్ చేయ‌ని రికార్డ్ ఎంటో తెలుసా.?

Most Maiden Overs In IPL. ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌లో ఈసారి 10 జట్లు రంగంలోకి దిగాయి.

By Medi Samrat  Published on  20 April 2022 7:56 AM GMT
ఐపీఎల్‌లో ఇప్ప‌టివ‌ర‌కూ ఏ బౌల‌ర్ కూడా బ్రేక్ చేయ‌ని రికార్డ్ ఎంటో తెలుసా.?

ఇండియన్ ప్రీమియర్ లీగ్ 15వ సీజన్‌లో ఈసారి 10 జట్లు రంగంలోకి దిగాయి. మరోసారి భారత్‌లో క్రీడాభిమానులు ఐపీఎల్ ఫీవ‌ర్‌తో ఊగిపోతున్నారు. ఐపీఎల్ ద్వారా ఎంతోమంది ప్ర‌తిభావంతులు వెలుగులోకి వ‌చ్చారు. ఎన్నో రికార్డులు సొంతం చేసుకున్నారు. అలాంటివారిలో భార‌త మాజీ క్రికెట‌ర్ ప్ర‌వీణ్ కుమార్ ఒక‌రు. ప్ర‌వీణ్‌ 5 సంవత్సరాల క్రితం తన చివరి IPL మ్యాచ్ ఆడాడు. అయితే అత‌ని పేరిట ఉన్న‌ రికార్డు ఇప్పటికీ చెక్కుచెదరలేదు.

ఐపీఎల్ కెరీర్‌లో 5 జట్లకు ప్రాతినిధ్యం వహించాడు బౌలర్ ప్రవీణ్ కుమార్. గుజరాత్ లయన్స్ జట్టు కోసం తన చివరి ఐపీఎల్ మ్యాచ్ ఆడాడు. ఐపీఎల్ చరిత్రలోనే అత్యధిక మెయిడిన్ ఓవర్లు బౌలింగ్ చేసిన రికార్డ్ ప్రవీణ్ కుమార్ సొంతం. విశేషమేమిటంటే.. ఐదేళ్లపాటు ఐపీఎల్‌కు దూరంగా ఉన్న ప్రవీణ్ కుమార్ రికార్డును ఇప్పటి వరకు ఏ బౌలర్ కూడా బద్దలు కొట్టలేకపోయాడు. ఈ ఫార్మాట్‌లో బ్యాట్స్‌మెన్ పరుగులు సాధించాలని తహతహలాడుతూ ఉంటారు. అయిన‌ప్ప‌టికీ ప్రవీణ్ కుమార్ త‌న‌ స్ట్రెయిట్ బౌలింగ్‌తో అద్వితీయమైన‌ రికార్డు సృష్టించాడు.

క్రికెట్ గేమ్‌ బ్యాట్స్‌మెన్‌కు చాలా స్నేహపూర్వకంగా ఉంటుందని.. బౌలర్లను విపరీతంగా దెబ్బతీస్తారని ఈ గేమ్ గురించి తరచుగా చెప్పబడుతున్నప్పటికీ.. క్రికెట్ అనేది పూర్తి అనిశ్చితితో కూడిన ఆట అని, ఇందులో పాచికలను తిప్పే అవకాశం ఉందని ప్ర‌వీణ్ కుమార్ అంటాడు.

ఐపీఎల్‌ మొదటి రెండు సీజన్లలో ప్రవీణ్ కుమార్ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్టుకు ఆడాడు. 2010లో రాజస్థాన్ రాయల్స్‌పై హ్యాట్రిక్ కూడా సాధించాడు. ఐపీఎల్‌లో ఈ ఘనత సాధించిన ఏడో బౌలర్ ప్రవీణ్ కుమార్. 2011 నుండి 2013 వ‌ర‌కూ కింగ్స్ XI పంజాబ్ తరపున ఆడాడు. 2008 నుండి 2017 వరకు ఐపీఎల్‌లో ఆడిన ప్రవీణ్ కుమార్ ఓవ‌రాల్‌గా 14 మెయిడిన్ ఓవ‌ర్లు బౌలింగ్ చేశాడు. ప్ర‌వీణ్ కుమార్‌.. కింగ్స్ XI పంజాబ్, సన్‌రైజర్స్ హైదరాబాద్, గుజరాత్ లయన్స్, రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు జట్ల తరపున ఆడాడు. ప్రవీణ్ కుమార్ వేసిన ఈ 14 ఓవర్లలో ఏ బ్యాట్స్‌మెన్ కూడా అతని బంతికి పరుగులు సాధించలేకపోయారు. ప్రవీణ్ కుమార్ ఐపీఎల్ కెరీర్‌లో 119 మ్యాచ్‌లు ఆడి 90 వికెట్లు తీశాడు.















Next Story