ధోనీ టీ షర్ట్ మీద అంత మెసేజ్ ఉందా.?
మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అసలు ఊహించలేము.
By Medi Samrat
మహేంద్ర సింగ్ ధోని ఎప్పుడు ఎలాంటి నిర్ణయం తీసుకుంటాడో అసలు ఊహించలేము. అది గ్రౌండ్ లో అయినా.. గ్రౌండ్ బయట అయినా!! తన భవిష్యత్తు ప్రణాళికలను వెల్లడించడానికి ప్రత్యేక మార్గాన్ని అన్వేషిస్తూ ఉంటాడు. 2020లో భారత స్వాతంత్ర్య దినోత్సవం రోజున తన ఇన్‌స్టాగ్రామ్‌లో అంతర్జాతీయ క్రికెట్ కు రిటైర్మెంట్‌ను ప్రకటిస్తాడని అసలు ఊహించలేదు. ఇక గత కొన్ని సంవత్సరాలుగా, ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ధోని రిటైర్మెంట్ గురించి పలుమార్లు ఊహాగానాలు వచ్చాయి. ఈ ఏడాది IPL 2025 సీజన్‌కు ముందు తన అభిమానులకు 'క్లియర్' మెసేజీని పంపినట్లు తెలుస్తోంది.
ఫిబ్రవరి 26, బుధవారం నాడు ధోని చెన్నైకి చేరుకున్నప్పుడు అతని టీ-షర్ట్‌పై "చివరిసారి" అని స్పష్టంగా ఉంది. ఈ సందేశం సూటిగా లేదు. చుక్కలు, డాష్‌లను ఉపయోగించి పెట్టారు. మోర్స్ కోడ్‌లో ఈ మెసేజీ ఉంది. కొంతమంది అభిమానులు సోషల్ మీడియాలో మోర్స్ కోడ్‌ని డీకోడ్ చేశారు. దీన్ని బట్టి ఆ కోడ్ 'వన్ లాస్ట్ టైమ్' అని అర్థం. IPL 2025 కోసం సిద్ధమవుతున్న చెన్నై సూపర్ కింగ్స్ ప్రీ-సీజన్ క్యాంప్‌లో ధోనీ చేరాడు. బుధవారం చెన్నై విమానాశ్రయం నుండి బయటకు వెళ్తున్నప్పుడు అతని టీ-షర్ట్‌పై ఈ కోడ్ ఉంది. ఇదే ధోని చెన్నై తరపున ఆటగాడిగా సేవలు అందించడమని స్పష్టమైన మెసేజీ పంపేశాడు.