సోషల్ మీడియాలో పెట్టే ఫోటోలను చూసి ఎవరు ఎవరికి ఏమవుతారో తెలుసుకోకుండా పుకార్లను వ్యాప్తి చేసేస్తూ ఉంటారు. అలా మహ్మద్ సిరాజ్ పక్కన ఓ అమ్మాయి ఉంటే ఆ అమ్మాయితో డేటింగ్ చేస్తున్నాడంటూ రూమర్లను సృష్టించేశారు. అయ్యా.. బాబూ.. ఆ అమ్మాయి తనకు చెల్లెలితో సమానం అంటూ సిరాజ్ మియా సోషల్ మీడియాలో వివరణ ఇవ్వాల్సి వచ్చింది.
ఆశా భోంస్లే మనవరాలు జనాయ్ భోంస్లే, క్రికెటర్ మహ్మద్ సిరాజ్‌తో కలిసి ఉన్న ఫోటో కారణంగా వారు ఒకరితో ఒకరు డేటింగ్ చేస్తున్నారనే వదంతులు వైరల్ అవ్వడానికి కారణమయ్యాయి. ఇన్స్టాగ్రామ్ స్టోరీలలో జనాయ్, సిరాజ్ వివరణ ఇచ్చారు. సోషల్ మీడియా ప్లాట్‌ఫారమ్‌లలో పుకార్లు వెలువడిన తరువాత జనాయ్.. సిరాజ్‌తో తన ఫోటోను పంచుకుంది. ఆమె, "మేరే ప్యారే భాయ్" అంటూ పోస్టు పెట్టింది.
దానిని తన ఇన్స్టాగ్రామ్ స్టోరీస్‌లో మళ్లీ రీపోస్ట్ చేసిన మహమ్మద్ సిరాజ్ "మేరీ బెహెన్ కే జైసీ కోయి బెహనా నహీన్. బినా ఇస్కే కహిన్ భీ ముఝే రెహనా నహిన్. జైసే హై చాంద్ సితారోన్ మే, మేరీ బెహనా హై ఏక్ హజారో మే" అంటూ తన స్పందనను తెలియజేశాడు. నా సోదరి లాంటి వారు ఎవరూ లేరని అర్థం వచ్చేలా సిరాజ్ చెప్పాడు. అలా సిరాజ్ మియా సోషల్ మీడియా రూమర్లకు బలయ్యాడు.