చాలా బాధపడ్డాను.. మిచెల్ మార్ష్ తీరుపై ష‌మీ ఫైర్‌

ఐసీసీ ప్రపంచకప్ 2023 టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఫైన‌ల్‌ మ్యాచ్‌లో భారత్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి

By Medi Samrat  Published on  24 Nov 2023 11:40 AM GMT
చాలా బాధపడ్డాను.. మిచెల్ మార్ష్ తీరుపై ష‌మీ ఫైర్‌

ఐసీసీ ప్రపంచకప్ 2023 టైటిల్‌ను ఆస్ట్రేలియా గెలుచుకుంది. ఫైన‌ల్‌ మ్యాచ్‌లో భారత్‌ను 6 వికెట్ల తేడాతో ఓడించి ఆస్ట్రేలియా ఈ ట్రోఫీని గెలుచుకుంది. చాలా జట్లు ట్రోఫీని గెల‌వాల‌ని కలలు కంటాయి. అయితే క‌ప్‌ గెలిచిన‌ ఆస్ట్రేలియా జ‌ట్టులోని ఆటగాడు మిచెల్ మార్ష్ మాత్రం ట్రోఫీపై తన పాదాలను ఉంచి అవమానించాడు. మిచెల్ మార్ష్ ప్ర‌వ‌ర్త‌న‌పై స‌ర్వ‌త్రా విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి. బాలీవుడ్ సూపర్ స్టార్ ఊర్వశి రౌతేలా కూడా మిచెల్ మార్ష్ చర్యలను విమర్శించారు. తాజాగా భారత ఫాస్ట్ బౌలర్ మహమ్మద్ షమీ కూడా స్పందించాడు.

ఈ ప్రపంచకప్‌ సీజన్‌లో మహమ్మద్‌ షమీ అద్భుత ప్రదర్శన చేశాడు. ప్రపంచకప్‌లో భారత్ తరఫున అత్యధిక వికెట్లు తీసిన బౌలర్‌గా షమీ నిలిచాడు. ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ ప్రపంచకప్ ట్రోఫీపై కాలు పెట్టిన ఘటనపై మహ్మద్ షమీ తీవ్ర విమర్శలు చేశాడు. ప్రపంచంలోని అన్ని జట్లు ఒకరితో ఒకరు పోరాడి గెలిచే ట్రోఫీని కాళ్ల కింద ఉంచుకోవడం మంచిది కాదని షమీ అన్నాడు. ప్రపంచమంతా ట్రోఫీని తమ తలపై ఎత్తుకోవాలని కోరుకుంటోందని.. ఆ ఫోటో చూసిన తర్వాత నేను బాధపడ్డానని ష‌మీ పేర్కొన్నాడు.

నిన్న బాలీవుడ్ సూపర్ స్టార్ ఊర్వశి రౌతేలా మిచెల్ స్టార్క్ చర్యలను విమర్శిస్తూ.. ప్రపంచ కప్ ట్రోఫీ పట్ల కొంత గౌరవం చూపించమని చెప్పింది. సేద తీర‌డం కోసం మీ పాదాలను దానిపై ఉంచడం సరికాదని పేర్కొంది. ఆస్ట్రేలియా ఆరో ప్రపంచ కప్ టైటిల్‌ను గెలుచుకుంది. మరోవైపు ప్రపంచకప్‌ గెలవాలని కలలు కనే జట్లు చాలానే ఉన్నాయి. చాలా జట్లు సెమీ-ఫైనల్‌కు కూడా అర్హత సాధించలేకపోయాయి. కానీ ఆస్ట్రేలియా ఆటగాడు మిచెల్ మార్ష్ మాత్రం ట్రోఫీపై తన పాదాలను ఉంచి త‌ల‌బిరుసు ప్ర‌ద‌ర్శించాడ‌ని విమ‌ర్శ‌లు వెల్లువెత్తుతున్నాయి.

Next Story