వేధింపులే కారణం : క్రికెట్‌కు ఆ పాక్ పేసర్ గుడ్‌బై
Mohammad Amir retires from international cricket claiming 'mental torture'. . తన రిటైర్మెంట్‌కు టీమ్ మేనేజ్‌మెంట్
By Medi Samrat Published on 18 Dec 2020 4:47 AM GMT
ఇంటర్నేషనల్ క్రికెట్‌కు పాకిస్తాన్ పేసర్ మహ్మద్ ఆమీర్ గుడ్‌బై చెప్పాడు. తన రిటైర్మెంట్‌కు టీమ్ మేనేజ్‌మెంట్ మానసిక వేధింపులు, వ్యవహార శైలే కారణమంటూ ఆవేదన వ్యక్తం చేస్తూ గురువారం ట్వీట్ చేశాడు. 2010-15 కాలంలో చాలా వేదనకు గురయ్యానని.. చేసిన తప్పుతో ఇష్టమైన క్రికెట్‌కు దూరమయ్యానని తెలిపాడు.
అయితే.. నిషేధం ముగిసిన అనంతరం జట్టులోకి వచ్చినా.. ఆటగాళ్లు తనతో కలిసి ఆడటానికి నిరాకరించారని.. ఆ సమయంలో షాహిద్ అఫ్రిది, అప్పటి పిసిబి చీఫ్ నజమ్ సేఠీ అండగా నిలిచారని పేర్కొన్నాడు. న్యూజిలాండ్‌కు ప్రకటించిన 35మంది ఆటగాళ్ల జాబితాలో చోటు దక్కకపోవడానికి మేనేజ్‌మెంటే కారణమంటూ ట్వీట్ చేశాడు. 2009లో 17ఏళ్లకే అంతర్జాతీయ క్రికెట్‌లోకి అరంగేట్రం చేసిన ఆమిర్.. 2010లో స్పాట్ ఫిక్సింగ్ వివాదంతో ఐదేళ్ల నిషేధానికి గురయ్యాడు.
అమీర్ తన అంతర్జాతీయ కెరీర్‌లో 36 టెస్టులాడి 119 వికెట్లు తీశాడు. 61 వన్డేల్లో 81 వికెట్లు, 50 టి20ల్లో 59 వికెట్లను పడగొట్టాడు. 2009లో టి20 ప్రపంచకప్ నెగ్గిన పాకిస్తాన్ జట్టు సభ్యుడు. నిషేధం తర్వాత 2017లో చాంపియన్స్ ట్రోఫీ విజయంలోనూ ఆమిర్ కీలకపాత్ర పోషించాడు.