మిథాలీ రాజ్ సంచలన ప్రకటన

Mithali Raj retires from all forms of international cricket

By Medi Samrat  Published on  8 Jun 2022 9:52 AM GMT
మిథాలీ రాజ్ సంచలన ప్రకటన

భారత మహిళా క్రికెట్ దిగ్గజం మిథాలీ రాజ్ బుధవారం అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్‌కు రిటైర్మెంట్ ప్రకటించింది. "ఈ రోజు నేను అన్ని రకాల అంతర్జాతీయ క్రికెట్ నుండి రిటైర్ అవుతున్నాను" అని ఆమె చెప్పుకొచ్చారు. "ఇన్ని సంవత్సరాల పాటు జట్టుకు నాయకత్వం వహించడం గౌరవంగా ఉంది. ఇది ఖచ్చితంగా నన్ను ఒక మనిషిగా తీర్చిదిద్దింది. భారతీయ మహిళల క్రికెట్‌ను కూడా ముందుకు నడిపించడంలో సహాయపడింది" అని ఆమె ఒక ప్రకటనలో తెలిపారు. మహిళల వన్డేల్లో అత్యధిక పరుగులు సాధించిన క్రీడాకారిణిగా మిథాలీ రిటైరైంది. ఆమె భారతదేశం తరపున 232 మ్యాచ్‌లకు ప్రాతినిధ్యం వహించి, 50.68 సగటుతో 7805 పరుగులు చేశారు. మంగళవారం విడుదల చేసిన ఐసీసీ మహిళల వన్డే బ్యాటింగ్ ర్యాంకింగ్స్‌లో మిథాలీ ఏడో స్థానంలో కొనసాగుతోంది.

1999 జూన్ లో ఆమె అంతర్జాతీయ క్రికెట్లో అడుగుపెట్టారు. ఇన్నేళ్ల పాటు మీరందరూ అందించిన ప్రేమ, మద్దతుకు ధన్యవాదాలు తెలుపుతున్నానని మిథాలీ అన్నారు. గత 23 ఏళ్ల క్రికెట్ జీవితంలో ఎన్నో చేర్చుకున్నానని, ఎన్నో సవాళ్లను ఎదుర్కొన్నానని... ప్రతి క్షణాన్ని ఎంతో ఆస్వాదించానని అన్నారు. అన్ని ప్రయాణాల మాదిరే ఈ ప్రయాణం కూడా ముగిసిందని చెప్పారు.

బాలీవుడ్ తార తాప్సీ పన్ను, మిథాలీ రాజ్ బయోపిక్‌గా రూపొందుతున్న "శభాష్ మిథు" చిత్రం జూలై 15న థియేటర్లలోకి రానుందని ప్రకటించింది. ఈ సినిమాకు శ్రీజిత్ ముఖర్జీ దర్శకత్వం వహించారు. ఇది మిథాలీ రాజ్ జీవితంలోని పలు క్షణాలను వెండితెరపై ఆవిష్కరించనుంది.












Next Story