రెండో టీ20 ముందు ఆసీస్‌కు గట్టి ఎదురుదెబ్బ
Mitchell Starc leaves Australia's T20I squad. రెండో టీ20 ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది.
By Medi Samrat
రెండో టీ20 ముందు ఆస్ట్రేలియాకు గట్టి ఎదురుదెబ్బ తగిలింది. స్టార్ పేసర్ మిచెల్ స్టార్క్ వ్యక్తిగత కారణాలతో టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడు. ఈ విషయాన్ని క్రికెట్ ఆస్ట్రేలియా ఓ ప్రకటనలో తెలిపింది. ఇప్పటికే ఆసీస్ స్టార్ ఓపెనర్ డేవిడ్ వార్నర్ గాయంతో టీ20 సిరీస్‌కి దూరమయిన విషయం తెలిసిందే. మార్కస్ స్టాయినిస్, అస్గన్ అగర్‌లకి కూడా గాయాలతో సతమతమవుతుండగా.. కెప్టెన్ ఫించ్ ను కూడా గజ్జలో గాయం వేదిస్తోంది. దీంతో అతడు రెండో టీ20లో ఆడడం అనుమానంగా మారింది. ఈ నేపథ్యంలో స్టార్క్ దూరం అవడం ఆసీస్ కు గట్టి ఎదురుదెబ్బగానే చెప్పవచ్చు. ఇక స్టార్క్ స్థానంలో ఆసీస్ ఎవరిని తీసుకుంటుందో వేచి చూడాలి.
కుటుంబ కారణాల రిత్యా స్టార్క్ టీమిండియాతో జరుగుతున్న టీ20 సిరీస్ నుంచి తప్పుకున్నాడని ఆసీస్ కోచ్ జస్టిన్ లాంగర్ తెలిపాడు. ప్రపంచంలో అన్నింటి కన్నా కుటుంబం ముఖ్యమని.. దాని తరువాతే ఏదైనా అని చెప్పాడు. మిచెల్‌కు కావాల్సినంత సమయాన్ని ఇస్తామని.. మళ్లీ అతడు జట్టులోకి రావాలని అనుకున్నప్పుడే జట్టులోకి వచ్చునని చెప్పాడు. అయితే మళ్లీ జట్టులోకి ఎప్పుడు వస్తాడనే దానిపై ఎలాంటి క్లారిటీ లేదన్నాడు. ఇక తొలి టీ20మ్యాచ్ గెలిచిన ఊపుమీదున్న టీమ్ఇండియా.. రెండో మ్యాచ్‌లోనూ విజయం సాధించి సిరీస్ గెలవాలని బావిస్తోంది.