ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్‌.. పెళ్లి కోసం స్వ‌దేశానికి వెళ్ల‌నున్న‌ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌

Mitchell Marsh to miss Delhi Capitals’ next few games. ఐపీఎల్ 2023లో అన్ని జట్లు ఆటగాళ్ల గాయాలతో ఆందోళన చెందుతున్నాయి.

By Medi Samrat  Published on  7 April 2023 6:45 PM IST
ఢిల్లీ క్యాపిటల్స్‌కు షాక్‌.. పెళ్లి కోసం స్వ‌దేశానికి వెళ్ల‌నున్న‌ స్టార్ ఆల్‌రౌండ‌ర్‌

ఐపీఎల్ 2023లో అన్ని జట్లు ఆటగాళ్ల గాయాలతో ఆందోళన చెందుతున్నాయి. ప్రతి జట్టులోని కొంత మంది ఆటగాళ్లు.. గాయం కారణంగా సీజన్‌కు దూరంగా ఉన్నారు. తాజాగా ఢిల్లీ క్యాపిటల్స్‌కు ఎదురు దెబ్బ తగిలింది. ఢిల్లీ ఆటగాడు ఐపీఎల్ నుంచి ఇంటికి తిరిగి వెళ్లాడు. దీంతో ఢిల్లీ క్యాపిటల్స్‌కు భారీ ఎదురుదెబ్బ తగలనుంది. ఈ జట్టు నుండి స్టార్ ఆల్ రౌండర్ మిచెల్ మార్ష్ తన పెళ్లి కోసం ఇంటికి తిరిగి వెళ్లనున్నాడు. ఢిల్లీ క్యాపిటల్స్ ఆడిన‌ రెండు మ్యాచ్‌లలో ఓడిపోయారు. మూడవ మ్యాచ్‌కి ముందు మార్ష్ వెళ్ల‌డం పెద్ద దెబ్బ. తమ తొలి రెండు మ్యాచ్‌ల్లో లక్నో సూపర్‌ జెయింట్‌, గుజరాత్‌ టైటాన్స్‌ చేతిలో ఓడిపోవడంతో వారు ఇప్పటికే ఒత్తిడిలో ఉన్నారు.

క్రిక్‌బజ్‌ నివేదిక ప్రకారం.. మార్ష్ తన వివాహానికి ఇంటికి వెళ్ల‌నుండ‌టంతో.. ఒక వారం పాటు ఢిల్లీ క్యాపిటల్స్ టీం కు అందుబాటులో ఉండడు. అలాగే జోస్ బట్లర్ గాయంతో ఇబ్బంది ప‌డుతున్న ప‌రిస్థితి. వైద్య సిబ్బంది నివేదిక కోసం ఎదురుచూస్తున్నట్లు రాజస్థాన్ రాయల్స్ జట్టు పేర్కొంది. IPL-2023లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు ఇప్పటికే కెప్టెన్ పంత్‌ లేకుండా ఆడుతోంది. ఢిల్లీ రెగ్యులర్ కెప్టెన్ రిషబ్ పంత్ ఈ ఏడాది ప్రారంభంలో ఘోరమైన కారు ప్రమాదంలో తీవ్రంగా గాయపడ్డాడు.


Next Story