ఐపీఎల్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

ఐపీఎల్‌ 2025 షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు అధికారులు.

By Medi Samrat
Published on : 29 March 2025 7:15 PM IST

ఐపీఎల్‌ షెడ్యూల్‌లో స్వల్ప మార్పు

ఐపీఎల్‌ 2025 షెడ్యూల్‌లో స్వల్ప మార్పులు చేశారు అధికారులు. ఏప్రిల్‌ 6న ఈడెన్‌ గార్డెన్స్‌ వేదికగా కేకేఆర్‌, లక్నో సూపర్‌ జెయింట్స్‌ మధ్య జరగాల్సిన మ్యాచ్‌ ఏప్రిల్‌ 8కి వాయిదా పడింది. ఏప్రిల్‌ 8న ఈ మ్యాచ్‌ మధ్యాహ్నం 3:30 గంటలకు ప్రారంభమవుతుంది. బెంగాల్‌ క్రికెట్‌ అసోసియేషన్‌, కోల్‌కతా పోలీసుల విజ్ఞప్తి మేరకు బీసీసీఐ షెడ్యూల్‌ను సవరించింది. ఏప్రిల్‌ 6న శ్రీ రామ నవమి కావడంతో కోల్‌కతాలో ఉ‍త్సవాలు ఘనంగా జరుగుతాయి. అదే రోజు మ్యాచ్‌ జరుగనుండటంతో కోల్‌కతా పోలీసులకు మ్యాచ్‌ భద్రతా ఏర్పాట్లు చేయడం​ కష్టమవుతుంది. ఈ నేపథ్యంలో మ్యాచ్‌ తేదీని వాయిదా వేయాలని క్యాబ్‌, కోల్‌కతా పోలిసులు బీసీసీఐని కోరారు.

ప్రకటించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 6న రెండు మ్యాచ్‌లు జరగాల్సి ఉంది. కేకేఆర్‌, లక్నో మ్యాచ్‌ మధ్యాహ్నం జరగాల్సి ఉండగా అదే రోజు రాత్రి 7:30 గంటలకు సన్‌రైజర్స్‌, గుజరాత్‌ మ్యాచ్‌ హైదరాబాద్‌లో జరగాల్సి ఉంది. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం కేకేఆర్‌, లక్నో మ్యాచ్‌ వాయిదా పడగా గుజరాత్‌, సన్‌రైజర్స్‌ మ్యాచ్‌ యధాతథంగా జరుగనుంది. సవరించిన షెడ్యూల్‌ ప్రకారం ఏప్రిల్‌ 8న రెండు మ్యాచ్‌లు నిర్వహించనున్నారు.

Next Story