పాకిస్థాన్ క్రికెట్ లో మరోసారి ముసలం

పాకిస్థాన్ క్రికెట్ గాడిన పడుతుందని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది.

By Medi Samrat  Published on  19 Jan 2024 2:15 PM GMT
పాకిస్థాన్ క్రికెట్ లో మరోసారి ముసలం

పాకిస్థాన్ క్రికెట్ గాడిన పడుతుందని అనుకున్నప్పుడల్లా ఏదో ఒక రచ్చ జరుగుతూనే ఉంది. తాజాగా పాకిస్థాన్ క్రికెట్ లో కీలక పదవుల నుంచి మిక్కీ ఆర్థర్, గ్రాంట్ బ్రాడ్‌బర్న్, ఆండ్రూ పుట్టిక్‌ లు వైదొలిగారు. జనవరి 18న పాకిస్థాన్ క్రికెట్ బోర్డు వీరు రాజీనామా చేసినట్లు అధికారికంగా ధృవీకరించింది. నవంబర్ 2023లో భారతదేశంలో జరిగిన వన్డే ప్రపంచ కప్ తర్వాత వారికి నేషనల్ క్రికెట్ అకాడమీ (NCA)లో విధులు ఇచ్చారు. అయితే వీరు తమ స్థానాలకు రాజీనామా చేశారు. 2016 నుంచి 2019 మధ్య పాకిస్థాన్‌ జట్టుకు మిక్కీ ఆర్థర్ కోచ్ గా పని చేశాడు. ఏప్రిల్ 2023లో పాక్ జట్టులో డైరెక్టర్‌గా చేరారు. ఆర్థర్ 2016 నుండి 2019 వరకు పాకిస్తాన్ మెన్స్ క్రికెట్ జట్టుకు ప్రధాన కోచ్‌గా ఉన్నాడు. ఆర్థర్ కోచ్ గా ఉన్న సమయంలో పాకిస్తాన్ ICC టెస్ట్ టీమ్ ర్యాంకింగ్స్‌లో నెంబర్ వన్ స్థానానికి చేరుకోవడంతో పాటు 2017 ICC ఛాంపియన్స్ ట్రోఫీని గెలుచుకుంది.

ఇక గత ఏడాది 50 ఓవర్ల ప్రపంచకప్ తర్వాత పాకిస్థాన్ క్రికెట్ డైరెక్టర్ గా బాధ్యతలు చేపట్టిన మహ్మద్ హఫీజ్‌కు దీర్ఘకాలిక కాంట్రాక్ట్ ఇవ్వవద్దని క్రీడా మంత్రిత్వ శాఖ పాకిస్థాన్ క్రికెట్ బోర్డును కోరింది. క్రీడా రంగాన్ని పర్యవేక్షిస్తున్న అంతర్-ప్రాంతీయ కోఆర్డినేషన్ మంత్రిత్వ శాఖకు ఆమోదం కోసం పీసీబీ ఒప్పందం కాపీని పంపింది. "కాంట్రాక్టు చాలా కాలం పాటు కొనసాగింది, అయితే న్యూజిలాండ్‌లో T20 సిరీస్ తర్వాత ముగిసే స్వల్పకాలిక ఒప్పందాన్ని హఫీజ్‌తో కొనసాగించాలని బోర్డుకి చెప్పారు" అని విశ్వసనీయ మూలం తెలిపింది.

Next Story