ముంబై వర్సెస్ హైదరాబాద్.. 300 కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

IPL 2025 లో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఒకటైన ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కు వాంఖడే స్టేడియం వేదిక కానుంది

By Medi Samrat
Published on : 17 April 2025 6:15 PM IST

ముంబై వర్సెస్ హైదరాబాద్.. 300 కోసం ఎదురుచూస్తున్న ఫ్యాన్స్

IPL 2025 లో అత్యంత ఉత్కంఠభరితమైన మ్యాచ్‌లలో ఒకటైన ముంబై ఇండియన్స్ వర్సెస్ సన్‌రైజర్స్ హైదరాబాద్ మ్యాచ్ కు వాంఖడే స్టేడియం వేదిక కానుంది. రెండు జట్ల లోనూ భారీ హిట్టర్లు ఉండడంతో చాలా కాలంగా ఎదురుచూస్తున్న 300 పరుగుల స్కోరు చూసే అవకాశం కనిపిస్తోంది.

రెండు జట్ల మధ్య 23 మ్యాచ్ లు జరగగా ముంబై ఇండియన్స్ 12 మ్యాచ్ లలో విజయం సాధించగా, హైదరాబాద్ 10 మ్యాచ్ లలో గెలుపొందింది. ఒక మ్యాచ్ ఫలితం లేకుండా ముగిసింది. IPL 2024లో చివరిసారి ఆడినప్పుడు ముంబై ఇండియన్స్ 7 వికెట్ల తేడాతో హైదరాబాద్ ను ఓడించింది.

వాంఖడేలోని రెడ్ సాయిల్ పిచ్ సాంప్రదాయకంగా బ్యాట్స్‌మెన్‌కు అనుకూలంగా ఉంటుంది, కానీ IPL 2025 లో విభిన్న ఫలితాలు వచ్చాయి. KKRతో జరిగిన మ్యాచ్‌లో బౌలర్లు అద్భుతంగా బౌలింగ్ వేశారు, డిఫెండింగ్ ఛాంపియన్లు కేవలం 116 పరుగులకే ఆలౌట్ అయ్యారు. మైదానంలో జరిగిన రెండవ మ్యాచ్‌లో RCB 221 పరుగులు చేసింది. MI 209 పరుగులు చేసి 12 పరుగుల తేడాతో ఓటమి పాలైంది. వాంఖడేలో IPL 2025లో మొదటి 300 కంటే ఎక్కువ స్కోరు సాధించే అవకాశాలను కూడా ఉన్నాయని అంటున్నారు.

Next Story