18 ఏళ్ల టీనేజ్‌ అమ్మాయి బాక్సింగ్ రింగ్ లో..!

Mexican boxer Jeanette Zacarias Zapata dies five days after fight in Montreal. బాక్సింగ్.. ఎంతో ప్రమాదకరమైన ఆట..! కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు పోయే అవకాశం

By Medi Samrat  Published on  3 Sep 2021 1:03 PM GMT
18 ఏళ్ల టీనేజ్‌ అమ్మాయి బాక్సింగ్ రింగ్ లో..!

బాక్సింగ్.. ఎంతో ప్రమాదకరమైన ఆట..! కొన్ని కొన్ని సార్లు ప్రాణాలు పోయే అవకాశం ఉంది. ఇక చిన్న వయసులో బాక్సింగ్ రింగ్ లో అడుగుపెట్టి.. ఛాంపియన్స్ గా ఎదగాలని ఎంతో మంది అనుకుంటూ ఉంటారు. అయితే కొందరి జీవితాలు అర్ధాంతరంగా ఆరంభంలోనే ముగిసిపోతూ ఉంటాయి. ఇలా ఓ యువతి జీవితంలో చోటు చేసుకుంది. ప్రొఫెష‌న‌ల్ బాక్సింగ్ రింగ్ లో ఆమె ప్రాణాలను కోల్పోయింది. ప్రొఫెష‌న‌ల్ బాక్సింగ్ ఫైట్‌లో పాల్గొన్న 18 ఏళ్ల టీనేజ్‌ అమ్మాయి తీవ్ర గాయాల‌పాలై ప్రాణాలు కోల్పోయిన ఘటన మాంట్రియ‌ల్‌లో జ‌రిగిన జీవైఎం గాలా ఇంట‌ర్నేష‌న‌ల్ బాక్సింగ్‌ ఈవెంట్‌లో చోటు చేసుకుంది.

మెక్సికోకు చెందిన వెల్ట‌ర్‌వెయిట్ బాక్స‌ర్ జెన్నెట్‌ జ‌కారియాస్ జ‌పాటా గత శనివారం షెడ్యూలైన ఆరు రౌండ్ల బాక్సింగ్ ఫైట్‌లో పాల్గొంది. మూడు రౌండ్ల వరకు ఈ ఫైట్‌ సజావుగా సాగింది. అయితే, నాలుగో రౌండ్‌లో ప్ర‌త్య‌ర్థి మేరీ పియర్ హౌల్‌ విసిరిన పంచ్‌ల‌కు జెన్నెట్‌ నేల‌కూలింది. ఐదో రౌండ్‌ బెల్‌ మోగాక కూడా ఆమె తేరుకోకపోవడంతో స్ట్రెచర్‌పై ఆసుపత్రికి తరలించారు. మెద‌డులో తీవ్ర రక్తస్రావం కావడంతో ఐదు రోజులు మృత్యువుతో పోరాడింది. ఆమె గురువారం కన్నుమూసినట్లు ఫైట్‌ నిర్వాహకులు వెల్లడించారు. దీంతో అక్కడ తీవ్ర విషాదం నెలకొంది. ప్రొఫెషనల్ బాక్సింగ్ గతంలో కూడా పలువురి ప్రాణాలు తీసింది.


Next Story
Share it