భారత హాకీ జట్టు నేడు ఆస్ట్రేలియాతో తలపడింది. ఈ మ్యాచ్‌లో 3-2తో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. దీంతో 52 ఏళ్ల తర్వాత ఒలింపిక్స్‌లో ఆస్ట్రేలియాపై భారత్ విజయం సాధించింది. ఈ మ్యాచ్ ప్రారంభమైన 12వ నిమిషంలో అభిషేక్ గోల్ చేశాడు. దీంతో భారత్ 1-0 ఆధిక్యంలో నిలిచింది. హర్మన్‌ప్రీత్ సింగ్ 13వ నిమిషంలో పెనాల్టీ కార్నర్‌లో గోల్ చేశాడు. దీంతో భారత్ 2-0తో ముందంజ వేసింది. ఆ తర్వాత 16వ నిమిషంలో వివేక్ ప్రసాద్ సాగర్‌కు గ్రీన్ కార్డ్ లభించింది. 25వ నిమిషంలో క్రెయిగ్ థామస్ గోల్ చేసి ఆస్ట్రేలియా ఖాతా తెరిచాడు. 26వ నిమిషంలో భారత్‌కు పెనాల్టీ కార్నర్‌ను హర్మన్‌ప్రీత్ సింగ్ సేవ్ చేశాడు. ఆట అర్ధ సమయానికి భారత్ 2-1 ఆధిక్యంలో ఉంది. ఆ తర్వాత హర్మన్‌ప్రీత్ సింగ్ 32వ నిమిషంలో పెనాల్టీ స్ట్రోక్‌ను గోల్ చేశాడు. దీంతో భారత్ 3-1తో ముందంజ వేసింది. మూడు క్వార్టర్ల తర్వాత భారత్ 3-1తో ఆస్ట్రేలియాపై ఆధిక్యంలో ఉంది. నాలుగో క్వార్టర్‌లో ఆస్ట్రేలియాకు చెందిన బ్లేక్ గోవర్స్ 55వ నిమిషంలో గోల్ చేసి భారత్ ఆధిక్యాన్ని 3-2 కు తగ్గించాడు.