రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్‌ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్

నవంబర్ నెల ఆస్ట్రేలియాకు చాలా ముఖ్యమైనది. ఈ నెలలో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌తో T20, ODI సిరీస్‌లు ఆడవలసి ఉంది.

By Kalasani Durgapraveen  Published on  29 Oct 2024 12:48 PM IST
రిటైర్మెంట్ ప్రకటించిన ఆస్ట్రేలియా స్టార్‌ వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్

నవంబర్ నెల ఆస్ట్రేలియాకు చాలా ముఖ్యమైనది. ఈ నెలలో ఆస్ట్రేలియా పాకిస్తాన్‌తో T20, ODI సిరీస్‌లు ఆడవలసి ఉంది. దీని తర్వాత భారత్‌తో ఐదు మ్యాచ్‌ల బోర్డర్-గవాస్కర్ టెస్ట్ సిరీస్‌ను కూడా ఆడవలసి ఉంది. ఈ సిరీస్‌ల‌కు ముందు ఆస్ట్రేలియాకు గ‌ట్టి ఎదురుదెబ్బ తగిలింది. ఆస్ట్రేలియా వికెట్ కీపర్-బ్యాట్స్‌మన్ మాథ్యూ వేడ్ అంతర్జాతీయ క్రికెట్కు అకస్మాత్తుగా రిటైర్మెంట్ ప్రకటించాడు. రిటైర్మెంట్ తర్వాత మాథ్యూ వేడ్‌కు మరో ఉద్యోగం కూడా వచ్చింది. అతడు ఆస్ట్రేలియా జట్టు కోచింగ్ స్టాఫ్‌లో కనిపించనున్నాడు. పాకిస్తాన్‌తో ప్రారంభమయ్యే మూడు మ్యాచ్‌ల T20 సిరీస్‌తో తన పదవీకాలాన్ని ప్రారంభించనున్నాడు.

అయితే.. వచ్చే రెండు వేసవి సీజన్లలో టాస్మానియా తరపున దేశవాళీ క్రికెట్, బిగ్ బాష్ లీగ్ ఆడటం కొనసాగిస్తానని చెప్పాడు. ఈ సంవత్సరం ఆడిన T20 ప్రపంచ కప్ తర్వాత అంతర్జాతీయ క్రికెట్‌లో నా కెరీర్‌ ముగిసింద‌ని నాకు పూర్తిగా తెలుసు. చీఫ్ సెలెక్టర్ జార్జ్ బెయిలీ, కోచ్ ఆండ్రూ మెక్‌డొనాల్డ్‌ల‌తో నా రిటైర్మెంట్ గురించి మాట్లాడాను. గత కొన్ని సంవత్సరాలుగా కోచింగ్ నా దృష్టిలో ఉంది. అదృష్టవశాత్తూ నాకు కొన్ని మంచి అవకాశాలు వచ్చాయి, అందుకు నేను కృతజ్ఞతలు తెలుపుకుంటున్నానని పేర్కొన్నాడు. నేను BBL, ఇతర ఫ్రాంచైజీ లీగ్‌లను ఆడుతూనే ఉంటాను. కానీ ఆటగాడిగా నా కమిట్‌మెంట్‌లతో పాటు కోచింగ్‌ను కూడా కొనసాగిస్తానని పేర్కొన్నాడు.

నా అంతర్జాతీయ కెరీర్ ముగిసింది, ఈ సందర్భంగా నా సహచరులు, సిబ్బంది, కోచ్‌లందరికీ ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. ఈ ఉత్తేజకరమైన ప్రయాణాన్ని నేను ఆనందించాను. నా దగ్గర మంచి వ్యక్తులు లేకుంటే నేను ఇక్కడికి వచ్చేవాడిని కాదని రిటైర్మెంట్ ప్రకటన‌లో వెల్ల‌డించాడు.

వేడ్ 36 టెస్టు మ్యాచ్‌లు ఆడి నాలుగు సెంచరీలు, ఐదు అర్ధ సెంచరీలతో సహాయంతో 1,613 పరుగులు చేశాడు. 97 వన్డే మ్యాచ్‌లలో 1,867 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో ఒక సెంచరీ, 11 అర్ధ సెంచరీలు చేశాడు. టీ20లో 92 మ్యాచ్‌లు ఆడి 1,262 పరుగులు చేశాడు. ఈ ఫార్మాట్‌లో మూడు అర్ధ సెంచరీలు సాధించాడు. టీ20లో జట్టుకు కెప్టెన్‌గా కూడా వ్యవహరించాడు.

Next Story