12 ఏళ్లుగా అజేయంగా నిలిచిన భారత్..!

వర్షం కారణంగా భారత్, ఆస్ట్రేలియా ఐదో, చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది.

By -  Medi Samrat
Published on : 8 Nov 2025 6:30 PM IST

12 ఏళ్లుగా అజేయంగా నిలిచిన భారత్..!

వర్షం కారణంగా భారత్, ఆస్ట్రేలియా ఐదో, చివరి టీ20 మ్యాచ్ వర్షం కారణంగా రద్దయింది. బ్రిస్బేన్‌లో భారీ వర్షం కారణంగా 4.5 ఓవర్లు మాత్రమే మ్యాచ్ ఆడగలిగారు. దీంతో ఈ సిరీస్‌ను భారత జట్టు 2-1తో కైవసం చేసుకుంది. ఈ మ్యాచ్‌లో ఆస్ట్రేలియా టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. గిల్, అభిషేక్ 29 బంతుల్లో 52 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పారు. అభిషేక్ 13 బంతుల్లో అజేయంగా 23 పరుగులు, గిల్ 16 బంతుల్లో 29 పరుగులతో అజేయంగా నిలిచారు.

ఆస్ట్రేలియాలో సిరీస్‌ను 2-1తో కైవసం చేసుకున్న భారత్ తన ఆధిపత్యాన్ని కొనసాగించింది. భారత్‌ గత ఐదు టీ20 సిరీస్‌ల‌లో ఆసీస్‌పై నాలుగింటిలో విజయం సాధించి, ఒకటి డ్రా చేసుకుంది. 2013 నుంచి ఇప్పటి వరకు ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్‌లో భారత్ ఓడిపోలేదు.. అంటే ఆస్ట్రేలియాలో భారత్ విజ‌య‌యాత్ర‌ కొనసాగుతోంది.

ఆస్ట్రేలియాలో టీ20 సిరీస్‌లో భారత్ ప్రదర్శన-

2007-08- ఆస్ట్రేలియా విన్‌ (1-0) (1 మ్యాచ్)

2011-12- డ్రా (1-1)

2013-2014 - భారత్ విన్‌ (1-0) (1 మ్యాచ్)

2015-16 - భారత్ గెలిచింది (3-0) (3 మ్యాచ్‌లు)

2018-19- డ్రా (1-1) (3 మ్యాచ్‌లు)

2020-21 భారత్ విన్‌ (2-1) (3 మ్యాచ్‌లు)

2025- భారత్ విన్‌ (2-1) (5 మ్యాచ్‌లు)

Next Story