హైదరాబాద్ ఉప్పల్ స్టేడియంలో జరుగుతున్న ఐపీఎల్ మ్యాచ్‌లో భాగంగా సన్ రైజర్స్ హైదరాబాద్ రికార్డు స్కోరు సాధించింది. సునామీ ఇన్నింగ్స్ ఆడిన సన్ రైజర్స్ బ్యాటర్స్ విధ్వంసం సృష్టించారు. టోర్నీ హిస్టరీలోనే రెండో అత్యధిక స్కోరు నమోదు చేసిన జట్టుగా హైదరాబాద్ జట్టు రికార్డు సాధించింది. రాజస్థాన్‌పై ఆరు వికెట్లు నష్టపోయి 286 పరుగుల భారీ స్కోరు సాధించింది.
కాగా ఇండియన్ ప్రీమియర్ లీగ్‌లో ఇప్పటికే 287 పరుగులతో హైదరాబాద్ టీమ్ హిస్టరీ క్రియేట్ చేసిన సంగతి తెలిసిందే. ఇషాన్ 45 బంతుల్లో 10 ఫోర్లు 6 సిక్సర్లు బాది సెంచరీతో అదరగొట్టాడు. హెడ్ (67), నితీష్ (30), క్లాసన్ (34), అభిషేక్ (24) రాణించారు. రాజస్థాన్ బౌలర్లలో తీక్షణ 2, సందీప్ 1, దేశ్పాండే 3 వికెట్లు తీశారు.