ఇంగ్లండ్ పేసర్ మార్క్ వుడ్ మోచేయి గాయం కారణంగా ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022 సీజన్‌లో పాల్గొనడం లేదని తెలుస్తోంది. వెస్టిండీస్‌లో మూడు మ్యాచ్‌ల పర్యటన కోసం ప్రస్తుతం ఇంగ్లండ్ టెస్ట్ జట్టుతో ఉన్న వుడ్, ఆంటిగ్వాలో జరిగిన మొదటి టెస్ట్‌లో అతని కుడి మోచేయికి గాయం అయింది. ఫలితంగా బార్బడోస్‌లో జరుగుతున్న రెండో టెస్టుకు దూరంగా ఉంచారు. ఈ ఏడాది ఫిబ్రవరిలో జరిగిన IPL మెగా వేలంలో, వుడ్‌ను లక్నో సూపర్ జెయింట్స్ (LSG) INR 7.5 కోట్లకు తీసుకుంది.
"ECB నుండి సూపర్ జెయింట్స్ అందుకున్న మెడికల్ అప్‌డేట్‌లో, వుడ్ ప్రస్తుతానికి బౌలింగ్‌కు దూరంగా ఉన్నాడు. వుడ్ తన కుడి మోచేయిలో ఇంప్పింగ్‌మెంట్ కారణంగా కేవలం 17 ఓవర్లు మాత్రమే మొదటి టెస్ట్ మ్యాచ్ లో బౌలింగ్ వేసి నిష్క్రమించాడు. దీంతో IPLలో పాల్గొనడం సందేహాస్పదంగా మారింది. శుక్రవారం తర్వాత ECB నుండి వుడ్ గాయం గురించి పూర్తీ నివేదిక రానుంది" అని తెలుస్తోంది.
సర్ వివియన్ రిచర్డ్స్ క్రికెట్ స్టేడియంలో డ్రాగా ముగిసిన మొదటి టెస్ట్ మూడో రోజున వుడ్ మోచేయికి గాయమైంది. డ్రా అయిన మొదటి టెస్ట్ మూడవ రోజున ఐదు ఓవర్లు మాత్రమే బౌలింగ్ చేయగలిగాడు. ఐదో రోజు ప్రారంభానికి ముందు నెట్స్‌లో బౌలింగ్ చేయడానికి ప్రయత్నించినప్పుడు 'తీవ్రమైన నొప్పి' ఎదుర్కొన్నాడు. ఇక వుడ్ వెస్టిండీస్ రెండవ ఇన్నింగ్స్‌లో బౌలింగ్ చేయలేదు.