ట్రోలింగ్‌పై గ‌ట్టిగానే స‌మాధానమిచ్చిన‌ మను భాకర్..!

పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మను భాకర్ బుధవారం తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ట్రోల్స్‌ను తిప్పికొట్టింది

By Medi Samrat  Published on  25 Sep 2024 1:51 PM GMT
ట్రోలింగ్‌పై గ‌ట్టిగానే స‌మాధానమిచ్చిన‌ మను భాకర్..!

పారిస్ ఒలింపిక్స్ డబుల్ మెడలిస్ట్ మను భాకర్ బుధవారం తన సోషల్ మీడియా హ్యాండిల్ ద్వారా ట్రోల్స్‌ను తిప్పికొట్టింది. ప్రతి ప్రమోషనల్ ఈవెంట్‌లోనూ ఒలంపిక్ పతకాలను ధరించిందని మను భాకర్‌పై సోష‌ల్ మీడియాలో నెటిజ‌న్లు ట్రోల్స్‌కు దిగారు. పదే పదే విమర్శలు రావడంతో మను భాకర్ మౌనం వీడారు. దీంతో ఆమె తన సోషల్ మీడియా ఖాతా ద్వారా విమర్శకులను స‌మాధానమిచ్చాడు. పతకాలు గర్వంగా ధరించాన‌ని.. తన ప్రయాణాన్ని తన తోటి భారతీయులతో పంచుకునే విధంగా అవి ఉన్నాయని రాసుకొచ్చింది.

పారిస్ 2024 ఒలింపిక్స్‌లో నేను సాధించిన రెండు కాంస్య పతకాలు భారత్‌కు చెందినవే అని మను భాకర్ ట్విట్టర్‌లో రాశారు. ఏదైనా ఈవెంట్‌కు నన్ను పిలిచి.. ఈ పతకాలను ప్రదర్శించమని అడిగినప్పుడు.. నేను వాటిని గర్వంగా ధరించాను.. నా అందమైన ప్రయాణాన్ని పంచుకోవడానికి ఇది ఓ మార్గం అని ఆమె పేర్కొంది.

మను భాకర్ భారత్ తరఫున పారిస్ 2024 ఒలింపిక్స్‌లో రెండు కాంస్య పతకాలు సాధించింది. మహిళల 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో ఆమె తన మొదటి పతకాన్ని గెలుచుకుంది, ఆ తర్వాత మిక్స్‌డ్ టీమ్ 10 మీటర్ల ఎయిర్ పిస్టల్ ఈవెంట్‌లో సరబ్జోత్ సింగ్‌తో కలిసి కాంస్య పతకాన్ని గెలుచుకుంది. ఒకే ఒలింపిక్స్‌లో రెండు పతకాలు సాధించిన తొలి భారతీయ క్రీడాకారిణిగా మను భాకర్ రికార్డు సృష్టించింది.

Next Story