రాజకీయాల్లోకి అడుగుపెట్టిన క్రికెటర్ మనోజ్ తివారీ విజయాన్ని అందుకున్నాడు. తృణమూల్ కాంగ్రెస్ పార్టీ తరపున ఎన్నికల్లో పోటీ చేసిన మనోజ్ తివారీ విజయాన్ని అందుకున్నాడు. భారతీయ జనతా పార్టీ అభ్యర్థి రతీంద్రనాథ్ చక్రవర్తిపై మనోజ్ తివారీ గెలిచాడు. శిబ్పూర్ అసెంబ్లీ స్థానం నుండి మనోజ్ తివారీ బెంగాల్ అసెంబ్లీలోకి అడుగు పెట్టనున్నాడు. తన విజయం కోసం పాటుపడ్డ ప్రతి ఒక్కరికీ ధన్యవాదాలు చెబుతూ ఉన్నానని మనోజ్ తివారీ సోషల్ మీడియాలో పోస్టు పెట్టాడు. శిబ్పూర్ ప్రజలకు తానెప్పుడూ రుణపడి ఉంటానని వెల్లడించాడు. కరోనా సమయాల్లో ప్రజలు జాగ్రత్తగా ఉండాలని సూచించాడు.

మనోజ్ తివారీ దేశవాళీలో అద్భుతమైన ఆట తీరుతో భారతజట్టులో స్థానం సంపాదించుకున్నాడు. అయితే భారతజట్టులో స్థానం సంపాదించుకున్నాక పెద్దగా రాణించలేదు. 12 వన్డేలు భారత్ తరపున ఆడిన మనోజ్ తివారి ఒక సెంచరీ, ఒక హాఫ్ సెంచరీ మాత్రమే సాధించాడు. భారత్ తరపున మూడు టీ20లు ఆడినప్పటికీ సత్తా చాటలేకపోయాడు. అయితే ఐపీఎల్ లో మాత్రం మనోజ్ తివారీ బాగా రాణించాడు. 2008 నుండి 2018 వరకూ మనోజ్ తివారీ ఐపీఎల్ ఆడాడు. కోల్ కతా నైట్ రైడర్స్, రైజింగ్ పూణే సూపర్ జెయింట్స్, కింగ్స్ లెవెన్ పంజాబ్ జట్ల తరపున 98 మ్యాచ్ లు ఆడిన మనోజ్ తివారీ 1695 పరుగులు చేశాడు. ఫస్ట్ క్లాస్ మ్యాచ్ లో ట్రిపుల్ సెంచరీ కూసే సాధించాడు మనోజ్ తివారీ. ఇక ఎమ్మెల్యేగా గెలిచిన మనోజ్ తివారీని పలువురు ప్రముఖులు శుభాకాంక్షలు తెలిపారు. ప్రజలకు మంచి చేయాలని కోరారు.


సామ్రాట్

Next Story