ఆ మాజీ క్రికెట‌ర్‌కు మంత్రి ప‌ద‌వి కేటాయించిన సీఎం మమతా బెనర్జీ

Manoj Tiwary takes oath as Minister of State in Mamata Banerjee Government. పశ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మూడోసారి ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన‌

By Medi Samrat  Published on  10 May 2021 2:22 PM GMT
ఆ మాజీ క్రికెట‌ర్‌కు మంత్రి ప‌ద‌వి కేటాయించిన సీఎం మమతా బెనర్జీ

పశ్చిమ బెంగాల్ ఎన్నిక‌ల్లో విజ‌యం సాధించి మూడోసారి ముఖ్య‌మంత్రి పీఠాన్ని అధిరోహించిన‌ మమతా బెనర్జీ సారథ్యంలోని కొత్త మంత్రివర్గం సోమవారం నాడు ఏర్పాటైంది. టీఎంసీకి చెందిన 43 మంది శాసనసభ్యులు రాజ్‌భవన్‌లో మంత్రులుగా ప్రమాణ స్వీకారం చేశారు. బెంగాల్‌ గవర్నర్‌ జగదీప్‌ ధన్‌కర్‌ వీరితో ప్రమాణం స్వీకారం చేయించారు.

మ‌మ‌త కేబినెట్‌లో 24 మంది మంత్రులుగా, 19 మంది సహాయ మంత్రులుగా ప‌ద‌వులు ద‌క్కించుకున్నారు. ఇక‌ మంత్రి మండలిలో సీనియర్‌ నేతలు, అనుభవజ్ఞులు, కొత్తవారికి చోటు దక్కింది. ఇక ఎన్నిక‌ల ముందు రాజ‌కీయ ఆరంగ్రేటం చేసిన బెంగాల్‌ రంజీ ఆటగాడు, భారత మాజీ క్రికెటర్‌, టీఎంసీ నేత మనోజ్‌ తివారీకి సైతం మంత్రిమండలిలో చోటు దక్కింది. మ‌నోజ్ తివారీకి క్రీడా మంత్రిత్వ శాఖను కేటాయించినట్లు తెలుస్తోంది. ఇక‌ సీఎం మమతా బెనర్జీతో కలిపి మంత్రివర్గంలో తొమ్మిది మంది మహిళలు ఉన్నారు.


Next Story