ఇండియన్ ప్రీమియర్ లీగ్ 18వ సీజన్‌లో 26వ మ్యాచ్ లక్నోలోని ఎకానా స్టేడియంలో గుజరాత్ టైటాన్స్, లక్నో జట్ల మధ్య జరిగింది. ఈ మ్యాచ్‌లో లక్నో జట్టు టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకుంది. తొలుత బ్యాటింగ్ చేసిన గుజరాత్ టైటాన్స్.. 20 ఓవర్లలో 6 వికెట్ల నష్టానికి 180 పరుగులు చేసింది. 12 ఓవర్లలో వికెట్ నష్టపోకుండా 120 పరుగులు చేసిన జట్టు.. ఆ తర్వాత 6 వికెట్లు కోల్పోయింది. గిల్, సాయి సుదర్శన్‌లు అర్ధ సెంచరీ ఇన్నింగ్స్‌లు ఆడారు.
ఆ తర్వాత లక్నో సూపర్ జెయింట్స్ ఇన్నింగ్సు నెమ్మదిగా ప్రారంభమైంది. పంత్, మార్క్‌రామ్‌తో ఓపెనింగ్‌కి వచ్చాడు. పవర్‌ప్లేలో లక్నో సూపర్ జెయింట్ వికెట్ నష్టపోకుండా 61 పరుగులు చేసింది. మార్క్రామ్ 28 పరుగులతో, పంత్ 17 పరుగులు చేశారు. ఆ తర్వాత రిషబ్ పంత్(21) అవుటయ్యాడు. ప్రసిద్ధ కృష్ణ గుజరాత్‌కు మొదటి వికెట్ అందించాడు. అనంతరం ఐడెన్ మార్క్రామ్ అర్ధ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. మరో పక్క నికోలస్ పురాన్ సిక్సర్లతో విరుచుకుపడ్డాడు. మరో ఎండ్‌లో ఉన్న మార్క్రామ్ 58 పరుగుల వద్ద ఔటయ్యాడు. దీంతో జట్టు రెండు వికెట్ల నష్టానికి 123 పరుగులు చేసింది. ఓ క్క లక్నో సూపర్ జెయింట్ విజయానికి చేరువైన క్రమంలో నికోలస్ పూరన్ 61 పరుగుల వద్ద ఔటయ్యాడు. జట్టుకు 18 బంతుల్లో 18 పరుగులు కావాలి. ఆ తర్వాత ఆయుష్ బడోని(28) లక్నోను విజయతీరాలకు తీసుకెళ్లాడు.