ఐపీఎల్ 2024 39వ మ్యాచ్‌లో చెన్నై సూపర్ కింగ్స్ లక్నో సూపర్ జెయింట్స్‌తో తలపడింది. ఈ మ్యాచ్ చెన్నైలోని చెపాక్ స్టేడియంలో జరిగింది. ఈ మ్యాచ్‌లో చెన్నైపై లక్నో ఎనిమిది వికెట్ల తేడాతో విజయం సాధించింది. లక్నో కెప్టెన్ రాహుల్ టాస్ గెలిచి ముందుగా బౌలింగ్ ఎంచుకున్నాడు. చెన్నై 210 పరుగులు చేయగా.. లక్నో 19.3 ఓవర్లలో లక్ష్యాన్ని ఛేదించింది.
టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన చెన్నై నాలుగు వికెట్లకు 210 పరుగులు చేసింది. సీఎస్‌కే తరఫున రితురాజ్ గైక్వాడ్ 108 పరుగులతో అజేయంగా నిలిచాడు. అనంతరం లక్నో 19.3 ఓవర్లలో నాలుగు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని ఛేదించింది. మార్కస్ స్టోయినిస్ 63 బంతుల్లో 124 పరుగులు చేసి నాటౌట్‌గా నిలిచాడు. ఈ విజయంతో లక్నో జట్టు పాయింట్ల పట్టికలో నాలుగో స్థానానికి చేరుకుంది. చెన్నై ఐదో స్థానానికి పడిపోయింది. చెన్నై తదుపరి మ్యాచ్ ఏప్రిల్ 28న సన్‌రైజర్స్ హైదరాబాద్‌తో ఆడాల్సి ఉండగా.. లక్నో జట్టు ఏప్రిల్ 27న రాజస్థాన్ రాయల్స్‌తో ఆడనుంది.