అదరగొడుతున్న లక్నో.. హ్యాట్రిక్ విజయం
Lucknow Super Giants beat Delhi Capitals by six wickets.ఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కొత్త టీమ్ లక్నో సూపర్
By తోట వంశీ కుమార్ Published on 8 April 2022 9:24 AM ISTఇండియన్ ప్రీమియర్ లీగ్(ఐపీఎల్)లో కొత్త టీమ్ లక్నో సూపర్ జెయింట్స్ అదరగొడుతోంది. ఆడిన తొలి మ్యాచ్‌లో ఓటమి పాలైనప్పటికి.. ఆ తరువాత గొప్పగా పుంజుకుని వరుసగా మూడో విజయాన్ని తన ఖాతాలో వేసుకుంది. గురువారం రాత్రి ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో 6 వికెట్ల తేడాతో రాహుల్ సేన విజయం సాధించింది. ఈ విజయంతో పాయింట్ల పట్టికలో రెండో స్థానానికి ఎగబాకింది.
తొలుత బ్యాటింగ్ చేసిన ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు నిర్ణీత 20 ఓవర్లలో 3 వికెట్ల నష్టానికి 149 పరుగులు చేసింది. ఓపెనర్ పృథ్వీ షా (61; 34 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) అర్థశతకంతో చెలరేగగా.. కెప్టెన్ రిషబ్ పంత్ (39 నాటౌట్; 36 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్లు), సర్ఫరాజ్ ఖాన్ (36 నాటౌట్; 28 బంతుల్లో 3పోర్లు) ఆఖరి వరకు క్రీజులో నిలిచినా వేగంగా ఆడడంతో విఫలం కావడంతో ఢిల్లీ జట్టు ఓ మోస్తారు స్కోరుకే పరిమితమైంది. లక్నో బౌలర్లలో రవి బిష్ణోయ్ రెండు వికెట్లు తీయగా.. కృష్ణప్ప గౌతమ్ ఓ వికెట్ పడగొట్టాడు.
అనంతరం లక్నో 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని చేదించింది. ఓపెనర్ క్వింటన్ డికాక్ (80; 52 బంతుల్లో 9 ఫోర్లు, 2 సిక్సర్లు) బాధ్యాయుత ఇన్నింగ్స్‌తో ఆకట్టుకోగా.. చివరి ఓవర్‌లో యువ ఆటగాడు ఆయుశ్ బదోనీ (10 నాటౌట్; 3 బంతుల్లో ఒక ఫోర్, ఒక సిక్సర్) ఎలాంటి పొరబాటుకు తావు ఇవ్వకుండా తనదైన శైలిలో మ్యాచ్‌ను ముగించాడు. లక్నో బ్యాటర్లలో కెప్టెన్ కేఎల్ రాహుల్ (24), కృనాల్ పాండ్య(19 నాటౌట్) రాణించారు. ఢిల్లీ బౌలర్లలో కుల్దీప్ యాదవ్ రెండు వికెట్లు తీయగా, లలిత్ యాదవ్, శార్దూల్ ఠాకూర్‌లు చెరో వికెట్ పడగొట్టారు. డికాక్‌కు 'మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.