ఆ సమయంలో.. నాలుగో స్థానంలో బ్యాటింగ్ చేయమని అడిగారు..
హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. సిరాజ్ బంతితో అద్భుతాలు చేసాడు.
By Medi Samrat
హైదరాబాద్‌పై గుజరాత్ టైటాన్స్ విజయం సాధించింది. సిరాజ్ బంతితో అద్భుతాలు చేసాడు. సాయి కిషోర్, ప్రసిద్ధ కృష్ణ అతనికి అద్భుతమైన మద్దతు ఇచ్చారు. అదే సమయంలో కెప్టెన్ గిల్ స్వయంగా బ్యాటింగ్‌కు నాయకత్వం వహించాడు. అతనికి మొదట వాషింగ్టన్ సుందర్, తరువాత షర్ఫాన్ రూథర్‌ఫోర్డ్ మద్దతు ఇచ్చారు. అయితే ఒక్క పరుగు తేడాతో సుందర్ అర్ధ సెంచరీని కోల్పోయాడు.
వాషింగ్టన్ సుందర్ గుజరాత్ టైటాన్స్ తరఫున ఐపీఎల్ అరంగేట్రం చేసి తన పాత జట్టుపై బలమైన ఇన్నింగ్స్ ఆడాడు. గుజరాత్ 16 పరుగులకే రెండు వికెట్లు కోల్పోయిన సమయంలో వాషింగ్టన్ సుందర్ బ్యాటింగ్‌కు వచ్చాడు. ఇక్కడి నుంచి గిల్, సుందర్‌లు ఇన్నింగ్స్‌ను ముందుకు తీసుకెళ్లి 56 బంతుల్లో 95 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పడం ద్వారా విజయానికి పునాది వేశారు. ఇందులో సుందర్ 49 పరుగులు చేశాడు.
సుందర్ తన ఇన్నింగ్స్‌లో 29 బంతులు ఎదుర్కొని 5 ఫోర్లు, 2 సిక్సర్లు బాదాడు. మ్యాచ్ అనంతరం వాషింగ్టన్ సుందర్ తన ఇన్నింగ్స్ పట్ల సంతృప్తిగా కనిపించాడు. ఎంతో కష్టపడితే తనకు ఈ అవకాశం వచ్చిందని, దీనిని పూర్తిగా సద్వినియోగం చేసుకున్ననన్నారు. అదే సమయంలో తనను నాలుగో నంబర్‌లో బ్యాటింగ్ చేయమని ఎవరు అడిగారో చెప్పాడు.
వాషింగ్టన్ సుందర్ మాట్లాడుతూ.. రెండు వికెట్లు పడిన తర్వాత కోచ్ నన్ను నాలుగో నంబర్‌లో వెళ్లమని అడిగాడు. ఇది నాకు అరుదైన అవకాశం. నేను దానిని పూర్తిగా ఉపయోగించుకున్నాను.. హైదరాబాద్‌లో గత కొన్నేళ్లుగా రెండో ఇన్నింగ్స్‌లో వికెట్ సులువుగా మారడం. 160-170 పరుగుల లక్ష్యాన్ని ఛేదించడం అంత కష్టమేమి కావడం లేదని పేర్కొన్నాడు.
ఇదిలావుంటే.. హైదరాబాద్ తరఫున మహ్మద్ షమీ రెండు వికెట్లు పడగొట్టాడు. అతడు తప్ప SRH బౌలర్లు ఎవరూ ఆకట్టుకోలేకపోయారు. ఐదు మ్యాచ్‌లలో కేవలం ఒక విజయంతో SRH ఇప్పుడు పాయింట్ల పట్టికలో చివరి స్థానంలో ఉంది. కాగా జిటి 4 మ్యాచ్‌ల్లో మూడు విజయాలతో రెండో స్థానంలో నిలిచింది.